యాదాద్రి పవర్ ప్లాంట్ లో అవినీతి : కోమటిరెడ్డి

యాదాద్రి పవర్ ప్లాంట్ లో అవినీతి : కోమటిరెడ్డి
January 11 15:50 2018
హైదరాబాద్,
యాదాద్రి పవర్ ప్లాంట్ లో స్కామ్ జరిగింది. 24 గంటలు విద్యుత్ ఇవ్వడంలో మోసం దాగిఉందని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. గురువారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ స్కామ్ పై చర్చకు ఎవరు వచ్చినా… ఎక్కడికి వచ్చినా  నేను సిద్ధమేనని స్పష్టం చేసారు. పవర్ లేని పవర్ మినిస్టర్ తో నాకవసరంలేదు. నాది తప్పు అని తేలితే నేను రాజకీయాలను వదులుకుంటానని అన్నారు. స్పీకర్ కు నేరుగా నా రాజీనామా ఇస్తా. స్కామ్ పై ఓపెన్ గా సీఎం ఒప్పుకోవాలి. స్కామ్ ను నేను ప్రూవ్ చేసేందుకు సిద్ధం. సీఎం స్కామ్ లేదని ప్రూవ్ చేసుకోవాలని సవాలు విసిరారు. ఇకనైనా మోసం ఆపాలి.  విద్యుత్ సీఎండీ  ప్రభాకర్ రావును  పంపండి.  చర్చకు నేను సిద్ధమని అన్నారు. యాదాద్రి ప్లాంట్ నిర్మాణంలో 32వేల కోట్ల వర్క్ ను నామినేషన్ పై ఇచ్చారు. దీనిపై విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా అనుమానాలు వ్యక్తంచేశారని గుర్తు చేసారు. ఇంత పెద్ద పనులను ప్రైవేట్ వాళ్లకు కాకుండా ప్రభుత్వ సంస్థలకు ఇవ్వాలన్నాని కోమటిరెడ్డి అన్నారు.  హడావుడిగా సోలార్ ప్రాజెక్టులను పిలిచారు. 25 ఏళ్ళ వరకు ఒప్పందం చేసుకున్నారు. దీంతో 4 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని అయన అన్నారు. యదాద్రి పవర్ ప్రాజెక్టుతో ప్రజల పై కోట్ల భారం పడుతుంది.  జనవరి ఒకటో తేదీన 105 కోట్లతో పేపర్ ప్రకటనలు ఇచ్చారు. సోలార్ టెండర్లు రద్దు చేయండని అయన డిమాండ్ చేసారు. ఈ ప్రభుత్వం ప్రజాలపెరిట ఏ స్కీములు స్టార్ట్ చేసినా అందులో అవినీతి జరుగుతుంది.  అవినీతి చేయను అనే అధికారులను ఈ ప్రభుత్వం బదిలీ చేస్తోంది. అవినీతికి అనుకూలంగా ఉన్న  అధికారులకు అందలం ఎక్కిస్తుంది ఈ ప్రభుత్వమని అయన ధ్వజమెత్తారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15616
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author