దేశంలో తెలంగాణ నెంబర్ వన్ : లక్ష్మారెడ్డి

దేశంలో తెలంగాణ నెంబర్ వన్ : లక్ష్మారెడ్డి
January 11 15:59 2018
మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలంలో గురువారం నాడు జరిగి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి  పాల్గొన్నారు. ముందుగా అమ్మాపూర్ లో మత్స్యకారుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి, తరువాత పోమల్ లో ముదిరాజ్ భవనానికి ప్రారంభోత్సవం చేసారు. కొల్లూరు లో బీటీ రోడ్డు పనులు, మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. తరువాత  బహిరంగ సభలో ప్రసంగించారు. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్. రూ.40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని మంత్రి అన్నారు.
అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ పాటు పడుతున్నారు. ఇలాంటి సీఎం దేశంలో ఎక్కడా లేరు. స్వరాష్ట్రం వచ్చాక ఇంతగా అభివృద్ధి జరుగుతుందని ఎవరూ ఊహించలేదని అన్నారు. అందుకే ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ అయింది. ఏమి మాట్లాడో తెలియక ఇష్టానుసారం, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. అర్థం పర్థం లేని ఆరోపణలకు దిగుతున్నారు.  ఎవరు ఏంటి? ఏమి చేస్తున్నారో ప్రజలు గుర్తించాలి. అభివృద్ధికి పాటు పడుతున్న వాళ్లకు అండగా నిలవాలని అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15618
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author