అక్రమాలకు చెక్ 

అక్రమాలకు చెక్ 
January 11 17:52 2018
యాదాద్రి,
రేషన్‌ దుకాణాలు అంటేనే.. అక్రమాలకు అడ్డాలు.. లబ్ధిదారుడు బియ్యం తీసుకోకపోయినా.. తీసుకున్నట్టు రికార్డులు నమోదు కేం ద్రాలు… బోగ్‌సకార్డులతో పేదలకు అందాల్సి న కిలో రూపాయి బియ్యం.. బ్లాక్‌మార్కెట్‌కు తరలించే దుకాణాలు.. అని పలు సందర్భాల్లో పోలీసుల తనిఖీలో బట్టబయలైంది. దీంతో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు నిత్యావసర సరుకులను చౌకధరలకు అందించాల్సిన లక్ష్యం నెరవేరకపోగా.. కోట్లాది రూపాయాల ప్రజాధనం దుర్వినియోగమైతోందనేది జగమెరిగిన సత్యం.. అయితే ప్రజా పంపిణీ వ్యవస్ధను ముఖ్యంగా రేషన్‌దుకాణాల స్థాయిలోనే అక్రమాలకు అడ్డుకట్టవేయడానికి పౌరసరఫరాల శాఖ కొత్త కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.. రేషన్‌కార్డు ద్వారా నిజమై న లబ్ధిదారుడికి సరుకులు అందించే విధంగా పాయింట్‌ఆఫ్‌ సేల్‌(ఈ-పాస్‌) ద్వారా సరుకుల పంపిణీకి చర్యలు చేపట్టింది.
ప్రభుత్వం రేషన్‌ దుకాణాల్లో ఈ-పాస్‌ మిషన్లు ఏర్పాటు చేసి బోగస్‌ కార్డుదారులకు బియ్యం పంపిణీకి అడ్డుకట్ట వేయడమే ప్రభు త్వ ప్రధాన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రేషన్‌దుకాణంలో ఈ-పాస్‌ యంత్రాలను ఏర్పా టు చేసింది. అదే విధంగా తూకంలో వినియోగదారులను మోసం చేయకుండా అత్యాధునిక ఎలకా్ట్రనిక్‌ వేయింగ్‌ యంత్రాలు పంపిణీ చే సింది. యాదాద్రిభువనగిరి జిల్లాలో జనవరి నుంచే ఈ-పాస్‌ విధానాన్ని అమలు చేయాల ని నిర్ణయించారు. జిల్లాలో రేషన్‌దుకాణాల్లో ఈ పాస్‌ యంత్రాలను అమర్చిన తర్వాతే రే షన్‌కార్డు దారులకు సరుకులను అందజేస్తున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఫిబ్రవరి నుంచి ఈ-పాస్‌ విధానం అమలు జరగనుంది. దీంతో రేషన్‌ డీలర్ల అక్రమాలకు చెక్‌ పడనుందని అధికారులు భావిస్తున్నారు.
రేషన్‌ సరుకుల పంపిణీలో అక్రమాలు జ రుగకుండా.. రాష్ట్రవ్యాప్తంగా చౌకధరల దుకాణాల్లో ఈ-పాస్‌ విధానం అమలులో భాగంగా జనవరి నుంచి యాదాద్రిభువనగిరి జిలా ్లలో సరుకుల పంపిణీని ప్రారంభించ నున్నా రు. జిల్లాలో 461 రేషన్‌ దుకాణాలల్లో ఈ- పాస్‌ యంత్రాలను అమర్చడం ద్వారా స రుకులను అందించనున్నారు. అ యితే రేషన్‌దుకాణాల్లో యం త్రాలను అమర్చడానికి ప్ర భుత్వంతో ఒప్పందం చేసుకున్న ఓయాసిస్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మాత్రం అన్ని దుకాణాలకు యంత్రాలను సరఫరా చేసినప్పటికీ.. అమర్చడంలో మాత్రం జాప్యం చేయడంతో ఈనెలలో దుకాణాలల్లో సరుకులు చేరుకున్నా.. ఈ- పాస్‌ విధానం అమలు కారణంగా పేద ప్రజలకు సరుకులు అందడం లేదు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపు 260 దుకాణాలల్లో ఈ-పాస్‌ యంత్రాలను మాత్రమే అమర్చారు. మరో 201 దుకాణాలల్లో అమర్చాల్సి ఉంది. ఒయాసిస్‌ సాఫ్ట్‌వేర్‌కు చెందిన ఆరుగురుసాంకేతిక నిపుణులు రోజుకు 10 దుకాణాలల్లో ఈ యంత్రాలను అమర్చుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో యంత్రాలు ఏర్పాటు చేయడానికి జనవరి 25 వరకు గడువు ఉందని అధికారులు తెలిపారు. అయితే ఈ-పాస్‌ యంత్రాలు అమర్చని దు కాణాల్లో పండుగకు సరుకులు అందడం క ష్టంగా మారింది.
ఈ-పాస్‌ విధానంలో సాంకేతిక సమస్యలు లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.. జిల్లాలోని తుర్కపల్లి, రాజాపేట, మో త్కూరు వంటి మండలాల్లో మారుమూల గ్రా మాల్లో సిగ్నల్స్‌ సక్రమంగా అందక సాంకేతిక సమస్యలు తలెత్తాయని పలువురు డీలర్లు తె లిపారు. గతంలో రేషన్‌కార్డులకు ఆధార్‌ కా ర్డులను అనుసంధానం చేసి.. వాటి ద్వారా రేషన్‌కార్డుదారు వేలిముద్ర ఆధారంగా ఇ-పా స్‌ యంత్రాల్లో బయో మెట్రిక్‌ విధానంలో వేలిముద్రలు సేకరించి సరుకులు అందిస్తారు. అయితే ఆధార్‌కార్డులోని వేలిముద్రలకు.. ప్ర స్తుతం ఇ-పాస్‌ యంత్రంలో నమో దు చేసిన వేలిముద్రలు సరితూగక రిజెక్టు అవుతున్నట్టుగా రేషన్‌కార్డుదారులు అంటున్నారు. దీంతె లబ్ధిదారులు కొత్తగా ఆధార్‌ కేంద్రాల్లో తమ వేలిముద్రలను మరోసారి అనుసంధానం చే సుకోవాల్సి వస్తోంది. సంక్రాంతి పండుగ సమీపిస్తున్నందున అన్ని మండలాల్లో సంక్రాంతిలోగా బియ్యం పంపిణీ జరిగేనా అన్న సందిగ్ధత నెలకొంది.
ఈ-పాస్‌ యంత్రంతో ప్రతి ఒక్క లబ్దిదారుని వేలిముద్రను అనుసంధానం చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక సంబంధిత లబ్దిదారు వచ్చి వేలిముద్ర వేస్తే తప్ప బియ్యం పంపిణీ చేసే అవకాశం ఉండదు. అత్యాధునిక టెక్నాలజీతో అందజేసిన వేయింగ్‌ మిషన్ల ద్వారా లబ్ధిదారులకు కచ్చితమైన తూకంతో బియ్యం అందుతాయి. వేయింగ్‌ మిషన్‌, ఈ- పాస్‌ యంత్రాన్ని బ్లూటూత్‌తో అనుసంధానం చేయడంతో కచ్చితమైన తూకం ఉంటేనే ఈ పాస్‌ యంత్రం ద్వారా రసీదు బయటకు వ స్తుంది. వేలిముద్ర వేయకపోయినా, తూకంలో మోసం చేసినా రసీదు రాదు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15626
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author