న‌గ‌రంలో పార్కింగ్‌పై ప్ర‌త్యేక పాల‌సి 

న‌గ‌రంలో పార్కింగ్‌పై ప్ర‌త్యేక పాల‌సి 
January 12 22:46 2018
హైదరాబాద్
గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేక పార్కింగ్ విధానాన్ని త్వ‌ర‌లోనే రూపొందిస్తున్నామ‌ని న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ వెల్ల‌డించారు. హోట‌ళ్లు, మాల్స్‌, ఫంక్ష‌న్‌హాళ్ల‌లో పార్కింగ్, ఫైర్ సేఫ్టీ, స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌పై వాటి య‌జ‌మానుల‌తో నేడు ప్ర‌త్యేక స‌మావేశాన్ని నిర్వ‌హించారు. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డితో పాటు పోలీసు, ట్రాఫిక్‌, ఫైర్ స‌ర్వీసుల ఉన్న‌తాధికారులు హాజ‌రైన ఈ స‌మావేశంలో మేయ‌ర్ మాట్లాడుతూ న‌గ‌రంలోని హోట‌ళ్లు, మాల్స్‌, ఫ‌క్ష‌న్‌హాళ్ల‌లో  స‌రిప‌డా పార్కింగ్‌ను ఏర్పాటు చేయ‌డంతో పాటు ఫైర్ సేప్టీ ప‌రిక‌రాలు త‌ప్ప‌నిస‌రిగా ఉంచాల‌ని సూచించారు. దేశంలో ఉన్న అన్ని మెట్రో న‌గ‌రాల్లో ట్రాఫిక్ స‌మ‌స్య అత్యంత తీవ్రంగా ఉంద‌ని, హైద‌రాబాద్‌లో ఈ స‌మ‌స్య మ‌రింత జ‌ఠిలం కాకుండా ఉండేందుకు ప్ర‌స్తుతం ఉన్న పార్కింగ్ వ్య‌వ‌స్థ‌ను మూడింత‌లుగా చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఖాళీ స్థ‌లాలు ఉన్న చోట్ల‌లో ప్ర‌త్యేక పార్కింగ్ కాంప్లెక్స్‌ల‌ను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేయ‌నుంద‌ని అన్నారు. ఇటీవ‌ల ముంబాయిలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంలో 15మంది దుర్మ‌ర‌ణం పొంద‌డాన్ని మేయ‌ర్ ప్ర‌స్తావిస్తూ హైద‌రాబాద్ న‌గ‌రంలోని అన్నీ హోట‌ళ్లు, రెస్టారెంట్లు, ఫంక్ష‌న్‌హాళ్ల‌లో అగ్నిప్ర‌మాద నివార‌ణ చ‌ర్య‌లు, ప‌రిక‌రాలు ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. అగ్నిప్ర‌మాద నివార‌ణ నిబంధ‌న‌లో కూడా మార్పులు తేనున్నామ‌ని అన్నారు. న‌గ‌రంలో ప్ర‌స్తుతం రోజుకు 4,500 మెట్రిక్ ట‌న్నుల‌కుపైగా చెత్త ఉత్ప‌త్తి అవుతోంద‌ని, వీటిలో వెయ్యి ట‌న్నులు హోట‌ళ్లు, మాల్స్‌, రెస్టారెంట్లు, ఫంక్ష‌న్‌హాళ్ల ద్వారా వ‌స్తుంద‌ని తెలిపారు. వ్య‌ర్థ‌ప‌దార్థాల నిర్వ‌హ‌ణ చ‌ట్టం 2016ను అనుస‌రించి వంద కిలోల చెత్త‌ను ఉత్ప‌త్తిచేసే ప్ర‌తి సంస్థ విధిగా కంపోస్ట్ ఎరువుల త‌యారీ యూనిట్ లేదా పిట్‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని తెలిపారు. దీంతో పాటు హైద‌రాబాద్‌లో భూగ‌ర్భ‌జ‌లాల ప‌రిర‌క్ష‌ణ‌కై ప్ర‌తి ఇంటిలో ఇంకుడు గుంత‌ను నిర్మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించినందున ప్ర‌తి హోట‌ల్‌, రెస్టారెంట్‌లో వాన నీటి ఇంకుడు గుంత‌ల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని మేయ‌ర్ రామ్మోహ‌న్ స్ప‌ష్టం చేశారు. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి మాట్లాడుతూ స్వ‌చ్ఛ హైద‌రాబాద్ సాధ‌న‌లో ప్ర‌తిఒక్క‌రూ క‌లిసిరావాల‌ని అన్నారు. ప్ర‌తి హోట‌ల్‌, రెస్టారెంట్‌ల‌లో శుభ్ర‌త‌పై చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను వివ‌రించే చార్ట్‌ల‌ను ప్ర‌ద‌ర్శించాల‌ని సూచించారు. కేవ‌లం 50రూపాయ‌లు ఇవ్వ‌కుండా త‌మ ఇళ్ల‌లోని చెత్త‌ను రోడ్ల‌పై వేస్తున్నార‌ని, దీని వ‌ల్ల న‌గ‌ర సుంద‌రీక‌ర‌ణ‌కు ఆటాంకంగా ఉంద‌ని పేర్కొన్నారు. ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో నిర్వ‌హించే స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌లో హైద‌రాబాద్ న‌గ‌రాన్ని అగ్ర‌స్థానంలో నిలిపేవిధంగా స‌హ‌క‌రించాల‌ని సూచించారు. ఫైర్ స‌ర్వీసెస్ అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ మాట్లాడుతూ ఎత్తుతో సంబంధంలేకుండా ప్ర‌తి భ‌వ‌నంలో అగ్నిప్ర‌మాద ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాల‌నే విధానాన్ని అమ‌లు చేయ‌నున్నామ‌ని తెలిపారు. సైబ‌రాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిసి శ్రీ‌నివాస్ మాట్లాడుతూ శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిస్థితిక‌న్నా ట్రాఫిక్ స‌మ‌స్య అత్యంత తీవ్రంగా ఉంద‌ని అన్నారు. ప్ర‌స్తుతం ఉన్న పార్కింగ్‌ను మూడింత‌లుగా ఎంచుకోవాల‌ని హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌కు సూచించారు. అక్ర‌మ పార్కింగ్‌కు విధించే జ‌రిమానాను వెయ్యి రూపాయ‌ల నుండి ఐదు వేల రూపాయ‌ల‌కు పెంచే ప్ర‌తిపాద‌న ఉంద‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా స్వ‌చ్ఛ‌దూత్ యాప్ ద్వారా త‌డి, పొడి చెత్త‌ను వేరుచేసే  ఫోటోల‌ను పంపినవారిలో డ్రా ద్వారా ల‌క్ష రూపాయ‌ల బ‌హుమ‌తిని మియాపూర్‌కు చెందిన సుధాక‌ర్‌రెడ్డికి ప్ర‌క‌టించారు. అదేవిధంగా దోమ‌ల నివార‌ణ‌కు మ‌స్కిటో హైదరాబాద్ యాప్ ద్వారా 16ప్ర‌శ్న‌ల‌కు స‌రైన స‌మాదానాలు ఇచ్చిన ప‌ది మందికి ఒకొక్క‌రికి రూ. 10వేల చొప్పున న‌గ‌దు బ‌హుమ‌తుల‌ను ప్ర‌క‌టించారు. ఈ కార్య‌క్ర‌మంలో పోలీసు అధికారులు ర‌మేష్ నాయుడు, చౌహాన్‌, జీహెచ్ఎంసీ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు ర‌వికిర‌ణ్‌, శంక‌ర‌య్య‌, మ‌నోహ‌ర్‌, ముషార‌ఫ్‌, జోన‌ల్ క‌మిష‌న‌ర్లు హ‌రిచంద‌న‌, శ్రీ‌నివాస్‌రెడ్డి, ర‌ఘుప్ర‌సాద్ త‌దిత‌ర అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఉత్త‌మ కాల‌నీలు, ఆసుప‌త్రులు, పాఠ‌శాల‌ల‌కు ప్ర‌త్యేక పుర‌స్కారాల‌ను అంద‌జేశారు. జీహెచ్ఎంసీ ఎంట‌మాల‌జి విభాగానికి దోమ‌ల నివార‌ణ పిచికారి యంత్రాన్ని విరాళంగా అంద‌జేసిన డాక్ట‌ర్‌కు ప్ర‌త్యేకంగా స‌న్మానం చేశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15662
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author