ఇస్రో సెంచరీ..పాకిస్తాన్ లో ఏడుపు

ఇస్రో సెంచరీ..పాకిస్తాన్ లో ఏడుపు
January 12 22:52 2018
నెల్లూరు
ఇస్రో తన వందో శాటిలైట్‌ను నింగిలోకి పంపించి అరుదైన ఘనత సాధిస్తే.. పాకిస్థాన్ మాత్రం తన వంకర బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. పౌర, మిలిటరీ వినియోగం కోసం లాంచ్ చేసే ఇలాంటి శాటిలైట్ల వల్ల ఈ ప్రాంత సుస్థిరతపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆ దేశ విదేశాంగ శాఖ అంటున్నది. శాటిలైట్ లాంచ్ మొదలుకాక ముందు నుంచే పాక్ తన ఏడుపు మొదలుపెట్టింది. పీఎస్‌ఎల్‌వీ సీ-40 ద్వారా కార్టోశాట్ శాటిలైట్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు మరో 30 శాటిలైట్స్‌ను కూడా రెండు కక్ష్యల్లో ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించింది. అయితే దీనిని మిలిటరీ కోసం వాడనున్నట్లు ఇండియా ప్రకటించడం పాక్‌కు వెన్నులో వణుకు పుట్టిస్తున్నది. ఇది తమపై ఎక్కడ ప్రభావం చూపుతుందో అన్నది దాని ఆందోళన. అందుకే శాటిలైట్ లాంచ్‌కు ముందే అక్కది విదేశాంగ శాఖ ప్రతినిధి మీడియాతో మాట్లాడారు. స్పేస్ టెక్నాలజీని వాడుకునే హక్కు అన్ని దేశాలకు ఉంది. కానీ ఇలాంటి వాటిని మిలిటరీ అవసరాల కోసం కూడా వాడుకోవడం సరికాదు. ఇతర దేశాల మిలిటరీ సామర్థ్యాన్ని అస్థిరపరచడం ఈ ప్రాంతం సుస్థిరతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అని ఆ ప్రతినిధి అన్నారు. అయితే తమ రీసెర్చ్ సెంటర్‌ను అభివృద్ధి చేసుకోలేక ఇండియాపై పడి ఏడుస్తున్నారంటూ పాకిస్థాన్ తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. 1961లో అంటే ఇండియా ఇస్రోను నెలకొల్పడం కంటే 8 ఏళ్ల ముందే పాకిస్థాన్ తన స్పేస్ సెంటర్‌ను ప్రారంభించింది. అయినా ఇప్పటివరకూ సాధించింది ఏమీ లేదు. మరోవైపు ఇస్రో మాత్రం నాసాతోనే పోటీ పడే స్థాయికి చేరుకోవడం విశేషం.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15664
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author