సోషల్ మీడియాలో వైరల్ గా మారిన బహిరంగ వాసి

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన బహిరంగ వాసి
January 12 23:06 2018
హైద్రాబాద్,
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు వినిపించినా.. కనిపించినా మళ్లీ ఏం వివాదం రాజేశాడ్రా బాబూ.. అనే సందేహం కలగక మానదు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వర్మ తాజాగా ‘అజ్ఞాతవాసి’ చిత్రంపై తనదైన శైలిలో సెటైర్‌లు గుప్పిస్తూ.. ‘బహిరంగవాసి’ టైటిల్‌తో పోస్ట్ చేసి సినీ సర్కిల్‌లో కలకలం రేపారు. గత కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్‌ను ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్న వర్మ ఒక్కసారిగా డౌన్ చేసేశాడు. ప్రపంచంలోని అమ్మాయిలంతా ఒకవైపు, పవన్ ఓ వైపు ఉంటే తాను అతడినే ఎంపిక చేసుకుంటానని పొగడ్తలతో ముంచేస్తున్నప్పుడే ఏదో మేటర్ ఉండే ఉంటుందనే సందేహాలు జనాల్లో వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయితే ఈయన గారు ఎప్పుడు ఎవర్ని తిడతాడో, ఎవర్ని పొగుడుతాడో ఎవరకీ అర్థం కాదు. ఎందుకంటే ఆయనకు ఆయనే అర్థం కారు కాబట్టి.తాజాగా పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రం జనవరి 10న విడుదలై.. డివైడ్ టాక్‌తో నడుస్తోంది. కాగా ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు రీచ్ కాలేకపోయిందనేది అధిక శాతం ఆడియన్స్ నుండి వినిపిస్తున్న మాట. ఇక ఈ మూవీ రిజల్ట్ సంగతి పక్కనపెడితే.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కాగా ఈ మూవీపై రామ్ గోపాల్ వర్మ.. ‘అజ్ఞాతవాసి’ సినిమాలోని పాపులర్ పోస్టర్‌లో పవన్‌ ఫొటోకి బదులు తన ఫొటోని మార్ఫ్‌ ఆ ఫోటోకు ‘బహిరంగవాసి’ అని టైటిల్ పెట్టి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో సోషల్ మీడియాలో అది వైరల్‌గా మారింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15671
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author