బాబు, కరువు కవల పిల్లలు

బాబు, కరువు కవల పిల్లలు
January 12 23:13 2018
తిరుపతి,
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కరువు కవల పిల్లల్లాంటి వారని, రైతులను చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగానూ దగా చేస్తున్నారు.. అని ధ్వజమెత్తారు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. చిత్తూరు జిల్లా పాదయాత్రలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. బాబు పాలనలో రైతులు తీవ్రమైన అవస్థలు పడుతున్నారని.. పండిన పంటకు కూడా మద్దతు ధరను కల్పించడంలో బాబు విఫలం అయ్యారని జగన్ అన్నారు. దేవుడిదయతో రేపు మన ప్రభుత్వం వస్తే రైతులకు మేలు చేయడానికి ప్రత్యేక పథకాలను అమలు చేస్తామని జగన్ అన్నారు. అందుకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని రైతులకు జగన్ పిలుపునిచ్చారు.నేటితో జగన్ పాదయాత్ర 60 రోజుకు చేరుకుంది. నేటి ఉదయం జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర ప్రారంభం అయ్యింది. వివిధ గ్రామాల మీదుగా సాయంత్రం వరకూ పాదయాత్ర సాగనుంది. ఇప్పటి వరకూ జగన్ సుమారుగా 820 కిలోమీటర్ల దూరాన్ని నడించారు.పాదయాత్రలో చిత్తూరు జిల్లా నేతలు క్రియాశీలంగా పాల్గొంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఆయనతో పాటు జిల్లా వైకాపా నేతలు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా తదితరులు పాదయాత్రలో సాగుతున్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15676
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author