మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి స్వచ్చందంగా……

మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి స్వచ్చందంగా……
January 13 23:53 2018
సిద్ధిపేట,
 ప్రభుత్వం తరపున కలెక్టర్ గా.. నేను మీ వాడిని..! మీరునాకు తోడుగా ఉండండి..! ఒక అడుగు ముందుకేసి మీ వైపు నేనుంటాననిప్రభుత్వానికి సహకరించాలనిసిద్ధిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి సింగారం గ్రామస్తులను కోరారు. సిద్ధిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం ఉదయం మల్లన్నసాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న గజ్వేల్ నియోజక వర్గ పరిధిలోని కొండపాక మండలం సింగారం గ్రామస్తులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్బంగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి మేం మొదటగాస్వచ్చందంగా ముందుకొచ్చామని.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు గారుమాకు స్పెషల్ ప్యాకేజీ ఇస్తామని భరోసా ఇచ్చారని వివరిస్తూ.., మా దేవుడు ఇకమీరేనయ్యా..అంటూ మా సింగారం గ్రామానికిస్పెషల్ ప్యాకేజీ ఇప్పించండనిగ్రామస్తులంతాకలెక్టర్ ను కోరారు. ఈ విషయమైరిజర్వాయర్లకు ఖిల్లాగా మారిన సిద్ధిపేట జిల్లాకు చరిత్రలో నిలిచిపోయేలా సేవ చేయడం నా అదృష్టమని కలెక్టర్ వెంకట్రామ రెడ్డి పేర్కొన్నారు. నేను రైతు బిడ్డనే ప్రతి రైతు సమానమేననినేను మీ ఇంటి మనిషిని ప్రభుత్వం తరపున  అండగా ఉంటానని గ్రామస్తులుఅధైర్యపడొద్దనికొండపోచమ్మ జలాశయంలో ముంపునకు గురవుతున్న మామిడ్యాల, తానేదార్ పల్లి, బైలంపూర్ గ్రామస్తులకు తున్కి-బొల్లారంలోరూ.25 లక్షల విలువైన మంచి ఫ్లాట్, ఇళ్లు ప్రభుత్వం కట్టిస్తున్నదని..ఇంతకంటే ఇంకేం కావాలి సార్ మాకు అని ఇప్పుడు ఆయా గ్రామస్తులంతా సంతోషంగా ఉన్నారని సింగారం గ్రామస్తులకు సవివరంగా తెలియజేశారు. ఇదే విషయమై కొండపోచమ్మ సాగర్ తరహాలో మల్లన్న సాగర్ ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి హరీశ్ రావులు భరోసా ఇచ్చారనిగ్రామస్తులకుకలెక్టర్ కు విన్నవించుకున్నారు. కుటుంబంలో ఒకరికొకరం కలిసి మెలిసి సహకరించుకుందామని, ప్రతి ఒక్క రైతు నాకు సమానమేననితెలిపారు. ప్రాజెక్టుసర్వేకు సహకరించండి.. పనులుప్రారంభిస్తున్నామని కలెక్టర్చెబుతూ.. గ్రామంలోని ఇంటింటికీసర్వే టీమ్స్ వస్తాయని, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి గ్రామంలోని ప్రతి పొలం వద్దకు వస్తారనిగ్రామస్తులకు తెలిపారు. మీకు ఏమైనా భూ ఇతరత్రా సమస్యలు ఉంటె రాసి ఆర్డీఓ కు ఇవ్వాలని సూచించారు. మంగళవారం అధికారులు గ్రామానికి హౌసింగ్ నెంబర్లు వేసేందుకువస్తారనివారికి సహకరించాలని కోరారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరపున న్యాయం చేస్తామని కలెక్టర్గ్రామస్తులకుచెప్పారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం మొదట భూమి ఇచ్చింది., మీ గ్రామమేనని మీకు న్యాయం చేయాల్సిన బాధ్యత నా పై ఉన్నదని కొండ పోచమ్మ జలాశయ ముంపు నిర్వాసితులకు న్యాయం చేసిన విధంగానే మీకు న్యాయం జరిగేలా చూస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ చర్చల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, ఇరిగేషన్ ఈఈ ఆనంద్, కొండపాక తహశీల్దారు ఆరీఫా, వివిధ శాఖలకు చెందిన అధికారులు, గ్రామ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15718
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author