బ‌ల్దియా ర‌వాణా విభాగంలో భారీగా సంస్క‌ర‌ణ‌లు

బ‌ల్దియా ర‌వాణా విభాగంలో భారీగా సంస్క‌ర‌ణ‌లు
January 14 00:03 2018
హైదరాబాద్
గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ప్ర‌తిరోజు 5వేల మెట్రిక్ ట‌న్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్త‌ను సేక‌రించి ట్రాన్స్ ఫ‌ర్ స్టేష‌న్‌ల‌కు త‌ర‌లించ‌డానికి 494 వాహ‌నాల‌ను జీహెచ్ఎంసీ ఉప‌యోగిస్తోంది. వీటిలో 260 వాహ‌నాలు జీహెచ్ఎంసీవి ఉండ‌గా 234 వాహ‌నాలు అద్దె వాహ‌నాలు ఉన్నాయి. శానిటేష‌న్‌, లైట్ మోటార్ వెహికిల్స్‌, ఇత‌ర విభాగాల‌కు క‌లిపి మొత్తం 773 వాహ‌నాలు జీహెచ్ఎంసికి చెందిన‌వి ఉండ‌గా వీటిలో 15ఏళ్ల‌కు పైబ‌డ్డ వాహ‌నాల‌ను తోల‌గించి న‌గ‌రంలో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు త‌మ వంతు బాధ్య‌త‌లో ప‌నిచేయాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి 276 పాత వాహ‌నాల‌ను కండెమ్న్ చేయాల‌ని నిర్ణయించ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 187 వాహ‌నాల‌ను వేలంవేసి తొల‌గించారు. 85 పాత వాహ‌నాల‌ను విక్ర‌యించారు. అయితే వాహ‌నాల సంఖ్య‌కు మించి డ్రైవ‌ర్ల సంఖ్య ఉన్న‌ప్ప‌టికీ ఏ ఒక్క‌రిని కూడా తీసివేయ‌వ‌ద్ద‌ని మేయ‌ర్ రామ్మోహన్ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీచేయ‌డంతో కాలం చెల్లిన వాహ‌నాల‌ను తొల‌గిచిన‌ప్ప‌టికీ ఉన్న వాహ‌నాల‌కు మూడు షిఫ్టులుగా ఉప‌యోగించ‌డం ద్వారా డ్రైవ‌ర్ల‌ను పూర్తిస్థాయిలో ఉప‌యోగిస్తున్నారు. ట్రాన్స్ పోర్ట్ విభాగంలో 977 మంది డ్రైవ‌ర్లు, 1537 మంది కార్మికులు ప‌నిచేస్తున్నారు. అయితే జీహెచ్ఎంసీ ర‌వాణా విభాగంలో 2017లో చేప‌ట్టిన గ‌ణ‌నీయ‌మైన సంస్క‌ర‌ణ‌ల వ‌ల్ల డిజిల్ వినియోగంలో త‌గ్గుద‌ల, వాహ‌నాల మ‌ర‌మ్మ‌తుల వ్య‌యం గ‌ణ‌నీయంగా త‌గ్గింది. పైగా జీహెచ్ఎంసీ ట్రాన్స్ పోర్ట్ విభాగంపై ప‌ర్య‌వేక్ష‌ణ‌, నియంత్ర‌ణ‌నున కేంద్ర కార్యాల‌యం ద్వారా కూకుండా సంబంధిత జోన‌ల్ క‌మిష‌న‌ర్ల‌కు అప్ప‌గించ‌డంతో వాటి నిర్వ‌హ‌ణా తీరులో మార్పు వ‌చ్చింది. దీనికితోడు ప్ర‌తి గార్బెజ్ వాహ‌నానికి ప్ర‌స్తుతం ఉన్న సిబ్బందికి అద‌నంగా ప్ర‌త్యేక సూప‌ర్‌వైజ‌ర్‌ను నియ‌మించ‌డంతో ఆయా వాహ‌నాలు గార్బెజ్ సేక‌ర‌ణ, త‌ర‌లింపు వేగంగ‌గా జ‌రుగుతూ, గార్బెజ్ త‌ర‌లింపు పై ఫిర్యాదులు త‌గ్గు ముఖం ప‌ట్టాయి. ప్ర‌స్తుతం న‌గ‌రంలో ఒక ట‌న్ను గార్బెజ్ త‌ర‌లింపుకు జీహెచ్ఎంసీ త‌న వాహ‌నాలు, డ్రైవ‌ర్లు, కార్మికుల ద్వారా త‌ర‌లించ‌డానికి రూ. 1020 వ్య‌యం చేస్తోంది. అయితే, అద్దె వాహ‌నాల ద్వారా త‌ర‌లింపుకు మెట్రిక్ ట‌న్నుకు కేవ‌లం 480 రూపాయ‌లు మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం. కాలం చెల్లిన వాహ‌నాల‌ను తొల‌గించ‌డం, అంత‌ర్గ‌త లోపాల‌ను స‌వ‌రించ‌డం, అధికారుల వికేంద్రీక‌ర‌ణ‌, వాహ‌నాల‌ను 24/7లో వినియోగించ‌డం, ఏ ఒక్క డ్రైవ‌ర్‌ను తొల‌గించ‌కుండా వారి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌డం, డీజిల్ కంపెనీల నుండే డీజిల్‌ను నేరుగా కొనుగోలు చేయ‌డం త‌దిత‌ర చ‌ర్య‌ల‌ను చేప‌ట్ట‌డం ద్వారా 2017లో బ‌ల్దియా ర‌వాణా విభాగంలో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్ట‌డం జ‌రిగింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15724
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author