ఉద్యోగ ఖాళీలపై శ్వేత పత్రం ప్రకటించాలి

ఉద్యోగ ఖాళీలపై శ్వేత పత్రం ప్రకటించాలి
January 14 00:12 2018
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే వరకు -“ఇంటికొక ఉద్యోగం” ఇవ్వాలని-ఇచ్చేవరకు పోరాటం చేయాలని జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ రోజు బిసి భవన్ లో రాష్ట్ర నిరుద్యోగ జాక్ అద్వర్యంలో జరిగిన నిరుద్యోగుల సమావేశంలో ప్రసంగిస్తూ అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు గడిచిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా 14 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి KCR ఒక లక్షా 12 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇలా ప్రకటించడం కొత్త కాదు. మరల ఎన్నికలు వస్తున్నాయి. అందుకోసం కొత్త వాగ్దానాలు కురిపించడానికి ప్రభుత్వ నేతలు మరోసారి నిరుద్యోగులను మోసం చేయడానికి చూస్తున్నారు. గత ఎన్నికల వాగ్దానం “ ఇంటికొక ఉద్యోగం ఇచ్చేవరకు మల్లి ఎన్నికలకు ఏలా వస్తారని నిరుద్యోగులు నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం గత 3 సంవత్సరాల 6 నెలలుగా వివిధ సాకులతో ఉద్యోగాలు భర్తీ చేయకుండా జాప్యం చేశారు. ఇప్పుడు కొత్త జోన్ల పేరుతో మరోసారి ఉద్యోగాలు ఉద్యోగాలు భర్తీ చేయకుండ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని కృష్ణయ్య విమర్శిoచారు. కొత్తగా 31 జిల్లాలు, 125 మండలాలు ఏర్పాటు చేసి ఒక సంవత్సరం గడిచింది. కొత్త జిల్లాలలో అదనంగా 30 వేల ఉద్యోగాలు అదనంగా వచ్చాయి. ఒక్కఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. ప్రభుత్వ ఆఫీసులన్ని ఖాళీ కుర్చీలతో వేల వేల బోతున్నాయని విమర్శించారు. ఈ రెండు లక్షల ఖాళీలు రిటైర్మెంట్ వలన ఏర్పడ్డ ఖాళీలు వీటిని భర్తీ చేయడానికి గల అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. గ్రూప్-1 లో 1200 ఉద్యోగాలు, గ్రూప్-3 సర్వీస్ లో 8 వేల ఉద్యోగాలు , గ్రూప్-4 క్లరికల్ ఉద్యోగాలు 36 వేలు టీచర్ ఉద్యోగాలు 40 వేలు, అలాగే జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ 6 వేలు భర్తీకై PSC ద్వార నోటిఫికేషన్ జారీ చేయాలనీ కృష్ణయ్య డిమాండు చేశారు. అలాగే ఇంజనీరింగ్ ఉద్యోగాలు, డాక్టర్, పారమెడికల్ ఇతర టెక్నికల్ ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ జారీ చేయాలనీ కోరారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15727
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author