బ్రాండ్ అంబాసిడర్లా…. మసక బారుతున్న ప్రతిష్ట

బ్రాండ్ అంబాసిడర్లా…. మసక బారుతున్న ప్రతిష్ట
January 16 13:00 2018
విజయవాడ,
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు కలిసి రావడం లేదట. ఫలితంగా వారు లేకుండానే ముందుకు వెళ్లే ఆలోచన చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్ గన్, కాజోల్,  పూనమ్ కౌర్, గజల్ శ్రీనివాస్ లను బ్రాండ్ అంబాసిడర్ లు గా తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. అమితాబ్ బచ్చన్ ను మెడికల్ అంబాసిడర్ గా ప్రకటిస్తే, అజయ్ దేవగన్ ,కాజల్ లను టూరిజం అంబాసిడర్ లుగా చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది. సినీనటి పూనమ్ కౌర్ ను చేనేత బ్రాండ్ అంబాసిడర్ అని ప్రకటించారు. కత్తి మహేష్, పవన్ కల్యాణ్ మధ్య రగిలిన వివాదంలో పూనమ్ కౌర్ పేరు వచ్చింది. అంతే ఆమె మాకు బ్రాండ్ అంబాసిడర్ కానే కాదని చెప్పేశారు.సిఎం చంద్రబాబునాయుడు అధికారికంగానే ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుంటున్నట్లు బహిరంగ వేదిక పైనే చెప్పారు. అప్పటి నుంచి ఆమె అనేక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంది. సభా వేదికల పై పిలిచేటప్పుడు ఆమెను చేనేత బ్రాండ్ అంబాసిడర్ గానే పిలిచారు. సిఎం చంద్రబాబునాయుడు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ ఆమె అసలు బ్రాండ్ అంబాసిడర్ కాదని మంత్రి కొల్లు రవీంద్ర లాంటి వారు తేల్చారు. వివాదం రానంత వరకు సరే. అది వచ్చాక ఎందుకు ఒప్పుకుంటారు. గజల్ ను పక్కన పెట్టేశారు. పూనమ్ ది అదే దారి. పవన్ కల్యాణ్ రికమండేషన్ తోనే ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నారంటారు. నిజం ఏంటో తెలియదుగానీ..అసలు పూనమ్ కౌర్ ఎవరని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది.గజల్ శ్రీనివాస్ ను మాత్రం స్వచ్ఛ అంద్రప్రదేశ్ అంబాసిడర్ గా ప్రజలను చైతన్యం చేసేందుకు బాగానే పని చేశాడు. కాకపోతే లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయి జైలుకు వెళ్లడంతో ప్రతిష్ట మసకబారింది. ఫలింతగా గజల్ ను ఇంటివద్దనే గజల్స్ పాడుకోవాలని చెప్పారట. ఆ హోదా నుంచి ప్రభుత్వం తప్పించవలసి వచ్చింది.  పివి సింధు, గతంలో ద్రోణవల్లి హారిక లాంటి వారిని స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్లుగా తీసుకోవాలని ఆలోచన చేసారు. కానీ దానికి ఆదిలోనే గండి పడింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15765
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author