టీడీపీలోకి వంగవీటి రాధ

టీడీపీలోకి వంగవీటి రాధ
January 17 15:22 2018
విజయవాడ,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వంగవీటి రాధ, తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైపోయిందని వార్తలు వస్తున్నాయి.   ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఆయనతో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించారన్న విషయం బుధవారం మీడియాతో కధనాలు వచ్చాయి. రాధతో చర్చలు పూర్తయ్యాయని కొందరు టీడీపీ సీనియర్ నేతలు వ్యాఖ్యానించారు. ఈ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్ పర్యటన నుంచి రాగానే రాధ చేరిక ఉంటుందని టీడీపీ నేతలు అంటున్నారు.
తనకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఖాయం చేసిన పక్షంలో పార్టీ మారేందుకు రాధ సిద్ధంగా ఉన్నారని, ఈ విషయమై తమతో చర్చించారని ఆయన ప్రధాన అనుచరులు చెబుతున్నారు. కాగా, గత కొంతకాలంగా వైసీపీలో అసంతృప్తిగా ఉంటున్న వంగవీటి రాధ, పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావిస్తున్నారు. మరోవైపు  కొద్దికాలం క్రితం మల్లాది విష్ణు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో ఆయనకు విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ టికెట్ ను వైఎస్ జగన్ అమోదించారని వార్తలు వచ్చాయి. నిజానికి  ఆ సీటుపై వంగవీటి రాధ ఎప్పటినుంచో ఆశలతో ఉన్నారు. అది కాసత్ఆ విష్ణుకు పోతుందనని రాధ  తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. రాధ తెలుగుదేశంలో చేరితే, బెటవాడ రాజకీయాల సమీకరణలు మారుతాయి. దాంతోపాటు వైకాపాకు కోలుకోని దెబ్బే తగలనుంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15811
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author