అమెరికాలో కరీరంనగర్ వాసి వ్యక్తి దుర్మరణం

అమెరికాలో కరీరంనగర్ వాసి వ్యక్తి దుర్మరణం
January 17 18:56 2018
కరీంనగర్,
అమెరికాలోని సౌత్‌ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భరత్‌రెడ్డి నరహరి దుర్మరణం చెందాడు. మృతుడు పీఆర్టీయూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి కుమారుడు. ఈ నెల 13న స్నేహితులతో కలిసి సైక్లింగ్ చేస్తున్న భరత్ రెడ్డి అదుపుతప్పి కింద పడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ట్రక్ అతని పైనుంచి వెళ్లింది. భరత్ రెడ్డిని వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.
భరత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఈ సమాచారం ఆలస్యంగా అందింది. అతడి మరణవార్తను చెప్పేందుకు స్నేహితులు చెప్పలేక సతమతమయ్యారు. ఈ సమాచారం తెలియగానే ఆస్ట్రేలియాలో ఉంటున్న భరత్ రెడ్డి సోదరుడు అమెరికా బయల్దేరాడు.
అమెరికాలో ఫిబ్రవరిలో జరగనున్న డాల్ఫీన్స్ క్యాన్సర్ ఛాలెంజ్ పోటీల్లో పాల్గొనేందుకు భరత్ రెడ్డి సైక్లింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. సౌత్ ఫ్లోరిడాలోని బాపిస్ట్ హెల్త్‌లో ఐటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న భరత్ రెడ్డి మంచి అథ్లెట్ అని తెలిసింది. అమెరికాలోని ట్రియాథ్లాన్ క్లబ్, గో రన్ రన్నింగ్ క్లబ్లో అతనికి సభ్యత్వం కూడా ఉంది. భరత్ రెడ్డి మరణానికి బాపిస్ట్ హెల్త్ సంస్థ డైరెక్టర్ సంతాపం ప్రకటించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15853
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author