కోటప్ప కోండలో నీతి ఆయోగ్ సభ్యుడు 

కోటప్ప కోండలో నీతి ఆయోగ్ సభ్యుడు 
January 17 19:07 2018
గుంటూరు,
నీతిఆయోగ్ సభ్యుడు అశోక్ కుమార్ జైన్ తో కలసి ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు బుధవారం నాడు  కోటప్పకొండలో పర్యటించారు. కోటప్పకొండలో జరుగుతున్న అభివృద్ధిని అశోక్ కుమార్ జైన్ కి వివరించారు.  నీతిఅయోగ్ తరుపున కోటప్పకొండ అభివృద్ధికి సహకరించాలని  జైన్ ను స్పీకర్ కోరారు. పర్యటన సందర్బంగా కోటప్పకొండలో స్పీకర్ కోడెల, అశోక్ కుమార్ జైన్ కి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత జైన్ మీడియాతో మాట్లాడారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారి పిలుపుమేరకు ఇక్కడికి వచ్చాను. గతంలో కోడెల మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర పనిచేసానని అన్నారు. నరసరావుపేట, కోటప్పకొండ ప్రాంతాలు ఎడ్యుకేషన్, టూరిజం, ఆద్యాత్మిక ఇతర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంతాయని అయన అన్నారు. కోడెల ఆధ్వర్యంలో కోటప్పకొండ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని అయన ప్రశంసించారు. కోడెల  ఏ పనైనా అనుకుంటే వెంటపడి పని చేస్తారు. కోటప్పకొండ అభివృద్ధికి సహకరిస్తానని అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15862
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author