రాష్ట్రాన్ని నేరరహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

రాష్ట్రాన్ని నేరరహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
January 18 23:12 2018
హైదరాబాద్‌
నేరాలకు ముగింపు పలికిన పాత నేరస్తులకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.తెలంగాణ రాష్ట్రాన్ని నేరరహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన సకల నేరస్తుల సమగ్ర సర్వేలో భాగంగా హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మంగార్‌ బస్తీలో జరిగిన సర్వేలో డీజీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత నేరస్తులతో సమావేశమై అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులతో పాటు స్థానిక పోలీసులు కూడా హాజరయ్యారు.. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సర్వే ద్వారా పాత నేరస్తుల వివరాలను పూర్తి స్థాయిలో సేకరిస్తామన్నారు. ఎవరెవరు ఎలాంటి నేరాలకు పాల్పడే వారో, గత చరిత్ర, ప్రస్తుత జీవన విధానం తదితర అంశాలను కూడా ఈ సర్వేలో పొందుపరుస్తున్నట్లు తెలిపారు. సమగ్ర సర్వే ద్వారా అందే పూర్తి వివరాలను తెలంగాణ పోలీస్ కాప్‌ యాప్‌ ద్వారా పోలీసులందరికి అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15936
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author