పరువు నష్టం వేస్తాను :  వంగవీటి రాధా

పరువు నష్టం వేస్తాను :  వంగవీటి రాధా
January 18 23:49 2018
విజయవాడ,
తను పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధా. వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు అని తన విషయంలో జరుగుతున్న ప్రచారం పట్ల ఆయన మండి పడ్డారు. తను వైకాపాను వీడను అని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేయడమే తన విధి అని ఆయన వ్యాఖ్యానించారు. అంతే కాదు.. తను పార్టీ మారతానని కల్పిత వార్తలు రాయవద్దని ఆయన వ్యాఖ్యానించారు.అలాంటి చెత్తవార్తలు రాస్తే.. పరువు నష్టం దావా వేస్తాను..’ అని వంగవీటి రాధా హెచ్చరించారు. వంగవీటి రాధా వైకాపాను వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటారు అని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. వెబ్ మీడియా ద్వారా ఈ ప్రచారం గట్టిగా జరిగింది. సోషల్ మీడియా ద్వారా దీనికి మరింత ప్రచారం లభించింది. ఈ నేపథ్యంలో రాధా స్వయంగా స్పందించాల్సి వచ్చింది.‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాకు సోదరసమానుడు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి గెలిచి.. పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం. నా తండ్రిని చంపిన తెలుగుదేశం పార్టీలోకి చేరాల్సిన ఖర్మ నాకు పట్టలేదు..’ అని రాధా వ్యాఖ్యానించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15973
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author