మొదటి డ్రోన్ ను ఆవిష్కరించిన చంద్రబాబు

మొదటి డ్రోన్ ను ఆవిష్కరించిన చంద్రబాబు
January 19 23:24 2018
అమరావతి
ఆంధ్రప్రదేశ్‌లో తయారు చేసిన మొట్ట మొదటి డ్రోన్‌ను శుక్రవారం కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.  మేడిన్‌ ఆంధ్రప్రదేశ్ డ్రోన్ ప్రత్యేకతలను ఐటీ శాఖ మంత్రి లోకేష్ ముఖ్యమంత్రికి  వివరించారు. మార్కెట్లో లభ్యమయ్యే డ్రోన్ల కంటే వీటి నాణ్యత ఎక్కువని, తక్కువ ధరలకే ఈ ఆంధ్రా డ్రోన్లను తయారు చేస్తున్నట్లు ఆయన వివరించారు. సాంకేతికతంగా ఉన్నత శ్రేణి పరికరంగానే కాకుండా అందుబాటు ధరలో రూపొందించిన డ్రోన్ ఇదని సీఎంకు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్ తెలిపారు. ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ, డ్రోన్ తయారీ సంస్థ ఓమ్ని ప్రెసెంట్ భాగస్వామ్యంతో విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన అమరావతి డ్రోన్ల కంపెనీని నెలకొల్పిన తరువాత తయారు చేసిన తొలి డ్రోన్‌ ఇదే కావడం విశేషం.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16010
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author