కాళేశ్వరం ఒక అద్భుతమైన ప్రాజెక్టు: నరసింహన్

కాళేశ్వరం ఒక అద్భుతమైన ప్రాజెక్టు: నరసింహన్
January 21 09:10 2018
భూపాలపల్లి
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు పనులతో పాటు పెద్దపల్లిలోని సుందిళ్ల బ్యారేజీ పనులను గవర్నర్ నరసింహన్ పరిశీలించారు. కాళేశ్వరం పనుల పట్ల గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారు. సమయానికి పనులు పూర్తవుతాయన్న ఆశాబావం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమైన ప్రాజెక్టు అని కొనియాడారు. సమయం ప్రకారం పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారన్న గవర్నర్.. అనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నేపల్లి పంప్‌హౌజ్‌ను గవర్నర్ సందర్శించారు. అక్కడ జరుగుతున్న పిల్లర్ల పనితీరును ఆయన పరిశీలించారు. మేడిగడ్డ ఆనకట్టను నరసింహన్ విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన ప్రాజెక్టు పనులను గవర్నర్‌కు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. మూడు షిఫ్టుల్లో సిబ్బంది పని చేస్తున్నారని గవర్నర్‌కు మంత్రి వివరించారు. అన్నారం బ్యారేజీ పనులను పరిశీలించిన గవర్నర్ నరసింహన్.. అక్కడ నీటి లభ్యత గురించి మంత్రి హరీష్‌రావును గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. శనివారం ఉదయం కాళేశ్వరం చేరుకున్న గవర్నర్ దంపతులు.. ముక్తీశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గవర్నర్‌కు అర్చకులు తీర్థ ప్రసాదాలుఅందజేశారు. ఆ తర్వాత అక్కడే గవర్నర్ అల్పాహారం చేశారు. గవర్నర్ వెంట ఆయన సతీమణి, స్పీకర్ మధుసూదనాచారి, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16025
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author