మంత్రాల నేపంతో భార్యకు చిత్రహింసలు

మంత్రాల నేపంతో భార్యకు చిత్రహింసలు
January 21 09:14 2018
మేడ్చల్,
మేడ్చల్ జిల్లా శామీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన భార్యకు పిచ్చి పట్టిందంటూ మంత్ర గాడిని పిలిచి భార్యకు వాతలు పెట్టించిన భర్త ఉదంతం ఇది.  వివరాల్లోకి వెళితే  మండలంలోని బొమ్మరాశి పెట్ గ్రామానికి చెందిన నాగేష్ కు మంగ (26)తో వివాహం జరిగింది.  కొద్దిరోజుల క్రితం  నాగేష్ మరో మహిళతో అక్రమ సంబంధం  పెట్టుకున్నాడు. ఈ  విషయం తెలుసుకున్న భార్య మంగ తమ కుల పెద్దలకు చెప్పి పంచాయతీ పెట్టించింది. పెద్దల సలహ మేరకు  నాగేష్ తన భార్య మంగను బాగా  చూసుకుంటానని అంగీకరించాడు. ఈ నెల 18 న నాగేష్ తన భార్య మంగను దెయ్యం, పిచ్చి పట్టిందని చెప్పి మంత్ర గాడిని పిలిపించాడు. ఇంట్లో ఉన్న బెల్టుతో మంగ కు వాతలు వచ్చేలా కొట్టి శారీరకంగా, మానసికంగా హింసిచాడు.  భర్త నాగేష్, అత్త, మాంత్రికుడు దాడి చేశారని బాధితురాలు మంగ వాపోయింది. విషయం తెలుసుకున్న  స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంగ ఫిర్యాదు మేరకు పోలీసులువిచారణ చేపట్టారు. తీవ్ర గాయాలకు గురైన మంగను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి  తరలించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16027
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author