హైటెక్ పేకాట

హైటెక్ పేకాట
January 21 09:20 2018
హైదరాబాద్,
గుట్టు చప్పుడు కాకుండా ఆడుకునే పేకాటలో హైటెక్ టెక్నాలజీ వచ్చేసింది.  సెల్ ఫోన్ లాంటి పరికరంతో ఎవరు గెలుస్తారో ముందుగానే చెప్పే టెక్నాలజీని వాడుతున్నారు. ఈ పరికరం కంప్యూటర్ కార్డు సెన్సార్ తో పనిచేస్తుంది. ఇది కార్డ్స్ ని స్కాన్ చేసి చెబుతోంది. డిస్ప్లే కనపడకుండా ఉండటం దీని ప్రత్యేకత. శుక్రవారం రాత్రి కృష్ణా నగర్ లో పేకాట శిబిరం నడుస్తుందని జూబ్లీ హిల్స్ పోలీసులకు సమాచారం అందింది. దాంతో దాడి జరిపారు. ఆరెస్టయిన వారిలో పేకాట నిర్వాహకుడు ప్రవీణ్ కుడా వున్నాడు. ప్రవీణ్ దగ్గర వున్న సెన్సార్ ఫోన్ ను చూసి పోలీసులు కంగుతిన్నారు. ఈ సెన్సార్ ఫోన్ ను ప్రవీణ్ ఢిల్లీలో కొన్నాడని పోలీసులకు చెప్పుకున్నాడు. పేకాట ముక్కలను ముందుగానే స్కాన్ చేసుకుని అవి ఎవరి చేతుల్లో వున్నాయో చెప్పేస్తుంది. దాంతో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారన్నది తెలిసిపోతుందని బంజారాహిల్స్ ఏసీపీ. కె ఎస్ రావు చెప్పారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16030
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author