గౌరవెల్లి ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన హరీశ్ రావు

గౌరవెల్లి ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన హరీశ్ రావు
January 22 22:22 2018
సిద్దిపేట,
హుస్నాబాద్ డివిజన్ లోని గౌరవెల్లి సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణానికి భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సోమవారం నాడు భూమిపూజ చేసారు. ఈకార్యక్రమంలో  కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్ రెడ్డి, కలెక్టర్ వెంకట్రాం రెడ్డి పాల్గోన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ 9 టీఎంసీల కెపాసిటీతో, లక్ష 60 వేల ఎకరాలకు సాగు, తాగునీరు అందించేలా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతుందని అన్నారు.  సీలింగ్ భూములు, ఇంటడుగు, మొఖస మీద ఉన్న వారికీ ప్రభుత్వం పక్షాన పూర్తిగా సహకరిస్తాం.  ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఇక్కడ వరద కాలువ కాస్త జీవకాలువగా మారుతున్నదన్నారు.
 ఎస్సాఆర్ ఎస్పీ నిండినా, నిండక పోయినా, వరద వచ్చిన , రాకపోయినా కాళేశ్వరం ద్వారా ఈ ప్రాజెక్టు ఒక్క  ఏడాదిలోనే జీవకాలువగా  మారనుంది.  1.4 టీఎంసీ వరద కాలువ ఉన్నప్పుడు 693 ఇండ్లు మునుగుతే, ఇప్పడు 9 టీఎంసీలకు పెంచితే అదనంగా మునుగుతున్న గ్రుహాలు 150 మాత్రమేనని చెప్పుకొచ్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు మీద  మీద ప్రాజెక్టులు తప్ప నిజంగా రైతులకు నీళ్లు ఇచ్చే ఉద్దేశ్యంతో ప్రాజెక్టులు కట్టలేదని విమర్శించారు.  కాళేశ్వరం ప్రాజెక్టు యుద్ద ప్రాతిపదికన నిర్మాణం చేపడుతున్నామని, ఇప్పటికే 75 శాతం పూర్తయిందన్నారు.   మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణం 96 పైసల వరకూ పూర్తి అయిందని చెప్పారు.   గౌరవెల్లి పూర్తి కాక ముందే ఎలాంటి ఎత్తిపోతలు లేకుండా 80 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నదని, 75 కిలోమీటర్ల కాలువలో 73 కిలోమీటర్లు పూర్తయిందని వివరించారు.
 ఒకప్పుడు ప్రాజెక్టు అంటే కల, కానీ ఇవాళ టిఆర్ ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టు అంటే నిజమని ఘంఠా పదంగా చెప్పారు.  ఎవరు అడ్డుపడ్డా వచ్చే వాన కాలానికి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు హుస్నాబాద్ కు వస్తాయని పేర్కొన్నారు.   గౌరవెల్లి ప్రాజెక్టులో 900 ఇండ్లు ముంపునకు గురవుతుంటే ఇందులో 700కు పైగా కుటుంబాలు ఒప్పుకోవడం జరిగిందని, మిగిలిన 220 కుటుంబాలతో మాట్లాడి ఒప్పిస్తామని మంత్రి తెలిపారు.  గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో భూ నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారం అందిస్తామని నీళ్ల మంత్రి హరీశ్ భరోసా ఇచ్చారు.
 కాంగ్రెస్ సర్కారు హయాంలో ఎకరాకు 2 లక్షలు ఇస్తే, తమ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు దాదాపు 7 లక్షలు చెల్లిస్తున్నామని చెప్పారు.  గౌరవెల్లి ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే గుడాటిపల్లి గ్రామానికే ఎక్కువగా భవిష్యత్, ఎక్కువగా లాభాలు ఉన్నాయని మంత్రి వివరించారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16121
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author