దళితులను మోసం చేస్తున్న చంద్రబాబు : జగన్

దళితులను మోసం చేస్తున్న చంద్రబాబు : జగన్
January 22 22:54 2018
చిత్తూరు,
చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి 68వ రోజు సోమవారం నాడు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ తన 68వ రోజు పాదయాత్రను శ్రీకాళహస్తి శివారులో పానగల్ నుంచి ప్రారంభించారు. పాదయాత్ర తంగెళ్లమిట్ట, పర్లపల్లి, పల్లమల, కత్తివారి కండ్రిగ, బసవనగుంట, అల్లత్తుర్ క్రాస్, పట్టాభి రెడ్డి గిరిజన కాలనీ మీదుగా రెడ్డిగుంటబడవ వరకు కొనసాగింది. . పాదయాత్రలో భాగంగా పల్లమాలలో ఎస్సీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అక్కడ దళితులను ఉద్దేశించి మాట్లాడారు. దళితులను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు. మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారు . అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశాడు. ఎవ్వరినీ వదల లేదు. ప్రతి కులాన్ని మోసం చేశాడని వ్యాఖ్యానించారు. ఎన్నికలపుడు చంద్రబాబు డోలు కొడతాడు . ఎన్నికలకు ముందు నేనే పెద్ద మాదిగనంటాడు. తరువాత దళితుల  భూములను ఆక్రమిస్తారని విమర్శించారు. అత్తగారి సొత్తా దళితుల భూములు? ఎన్నికలకు ముందు స్రతి పేద వాడికి భూమి స్థలం ఇస్తానని చెప్పాడు చంద్రబాబు . రూ అయిదు కోట్ల వడ్డీ లేని రుణం అన్నాడు.  లంబాడీలతో కూడా పోటో దిగుతాడు. వారినీ మోసం చేస్తాడని అన్నారు. దళితులు స్నానం చేయరు. దళితులు చదువు  కోరని మంత్రి ఆదినారాయణరెడ్డి అంటాడు. నిస్సిగ్గుగా ఇలా మంత్రి మాట్లాడుతున్నారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు ఎస్సీ ఆపీసర్  మహిళను కాలుతో కొట్టాడు. మంత్రి కాలుతో తన్నినా చర్యలులేవు. మరో వైపు ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని ముఖ్యమంత్రి అంటారని అయన అన్నారు. మరో వైపు దళితుల అసైన్డ్ భూములను ప్రభుత్వం ఆక్రమిస్తోంది.  వైయస్ హయాంలో 32 లక్షల ఎకరాలను  22 లక్షల మంది దళితులకు ఇచ్చారు. చంద్రబాబు దళిత భూములను చేజిక్కించుకుంటున్నారు. కరువు పనులు నిధులను ఇతర పనులకు మళ్ళిస్తున్నారు. నీరు చెట్టుకు ఉపాధి నిధులను వెచ్చిస్తున్నారు. సిమెంటు రోడ్లకు ఉపాధి నిధులను వెచ్చిస్తున్నారు. దీని వల్ల నిరుపేదలకు ఉపాధి లభించడం లేదని అయన అన్నారు.   ఏపీలో పలు చోట్ల దళితులపై దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. దళిత మహిళలకు భద్రత కరువైంది.  నవ రత్నాలు   దళితులకు వర  ప్రసాదం. దళిత చిట్టి పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు కావాలి. అపుడే దళిత కటుంబాల తల రాతలు మారుతాయి. కాంట్రాక్లర్లకు రేట్లు పెంచుతాడు.  పేదలకు పెన్షన్లు మాత్రం  పెంచరు. లంచాల కోసం కాంట్రాక్టర్లకు రేట్లు పెంచుతున్నాడని ఆరోపించారు. పులివెందుల నియోకవర్గంలో ని  బలపనూరులో         దళిత కుటుంబాల కరెంటు ఛార్జీలు హెచ్చుగా  ఉంటున్నాయి. ఒక దళిత కుటంబ కరెంటు బిల్లు రూ 20 వేలు వచ్చింది. కరెంటు బిల్లులు చూసి దళితులు లబోదిబోమంటున్నారని జగన్ అన్నారు. వైయస్సార్సీపీ అధికారంలోకి వస్తే దళి
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16129
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author