ఫార్మా డీ అభ్యర్దులకు న్యాయం చేస్తాం 

 ఫార్మా డీ అభ్యర్దులకు న్యాయం చేస్తాం 
January 23 13:00 2018
విజయవాడ,
ఫార్మా డీ విద్యార్థుల సంఘంతో వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డా కామినేని శ్రీనివాస్ సమావేశం అయ్యారు. మంగళవారం నాడు జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, జితేందర్ గౌడ్ కుడా పాల్గొన్నారు. ఫార్మా డీ విద్యార్థులకు కోర్సు పూర్తి చేసి 6 బ్యాచ్ లు బయటకు వెళ్లిన ఉద్యోగ అవకాశాలు లేవు. ఈ కోర్సును నిర్ధిష్టమైన ప్రాణళిక లేకుండా మొదలుపెట్టారు. వైద్య శాఖకు సంబంధం లేని కోర్సు, సాంకేతిక విద్యా పరిధిలో ఉందని మంత్రి అన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీలో అకాడమిక్ డి.ఎమ్.ఈ ( కన్వీనర్), హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరి, డిజి డ్రగ్స్, కమీషనర్ టెక్నికల్ ఎడ్యూకేషన్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విసీ, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సభ్యులతో కమిటీని నియమించడం జరిగిందని అయన అన్నారు. ఈ కమిటీ వివిధ రాష్ట్రలలో అమలు చేస్తున్న విధివిధానాలను పరిశీలించి ఒక నివేదిక ఇస్తారు. ఈ కమిటీ 45 రోజులలో నివేదిక సమర్పించాలి విద్యార్ధులకు ఏవిధంగా న్యాయం చేయాలనే దానిపై ఒక సారి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్  తో చర్చిస్తామని మంత్రి అన్నారు. విద్యార్ధులకు తప్పకుండా న్యాయం చేస్తాంమని భరోసా ఇచ్చారు. కోర్సు పూర్తి చేసిన విద్యార్ధులను వైద్యమిత్ర, జన- ఔషది క్రిందకు తీసుకొనేందుకు పరిశీలిస్తాం. మరోవైపు, కొత్త కాలేజీలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించామని మంత్రి స్పష్టం చేసారు. విద్యార్ధులను వైద్యారోగ్య శాఖలో సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.
మోడీ కి,జగన్ కు పోలిక లేదని అయన అన్నారు.  జగన్ అవినీతిపరుడు. ఎలాంటి మచ్చ లేని బీజేపీ…అవినీతిపరుడైన జగన్ తో కలవదని మంత్రి కామినేని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. టీడీపీ, బీజేపీ కలిసినందుకే ప్రజలు మాకు మద్దతిచ్చారని అయన అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16159
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author