తొత్తుగా వ్యవరిస్తున్నా పవన్‌ కల్యాణ్‌

తొత్తుగా వ్యవరిస్తున్నా పవన్‌ కల్యాణ్‌
January 23 22:51 2018
హైదరాబాద్‌
జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్‌ కల్యాణ్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబుకు పవన్‌ ఓ తొత్తుగా వ్యవరిస్తున్నారని మండిపడ్డారు.  పవన్‌ కల్యాణ్ రాజకీయ నాయకుడే కాదని.. ఆయనకు దళితులంటే తెలియదన్నారు.  మంగళవారం చంచల్‌గూడ జైలులో మందకృష్ణ మాదిగను కలిసి పరామర్శించిన అనంతరం వీహెచ్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో నియంత పాలన కొనసాగుతుంటే కేసీఆర్ అన్ని బాగా చేస్తున్నారని పవన్‌ ఎలా చెబుతారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విమర్శించిన పవన్‌.. నేడు మంచి పరిపాలకుడుగా ఎలా కొనియాడుతున్నారో చెప్పాలన్నారు. ప్రజల కోసం పోరాడుతున్న నాయకులను జైలులో పెట్టిన కేసీఆర్‌కు ప్రజలే బుద్ధిచెబుతారన్నారు.  ఈ అంశాన్ని ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నట్టు తెలిపారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16195
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author