గణతంత్రకు ఘనంగా ఏర్పాట్లు

గణతంత్రకు ఘనంగా ఏర్పాట్లు
January 23 23:15 2018
న్యూఢిల్లీ,
జనవరి 26న 69వ గణతంత్ర వేడుకలను జరుపుకోబోతోంది భారత దేశం దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ప్రారంభించేసింది కేంద్రప్రభుత్వం. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్రప్రభుత్వం అతిథులను ఫైనల్ చేశారు.2018, జనవరి 26న భారతదేశం 69వ గణతంత్ర వేడుకలను జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 69వ గణతంత్ర వేడుకలు. వంద ప్రభుత్వ విభాగాలు ఇందులో పాల్గొనబోతున్నాయి.  ఏసియన్ కూటమిలోకి భారత్ ప్రవేశించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వీరందరికీ ఆహ్వానించింది. గెస్ట్ కంట్రీస్ నుంచి 7 వందల మంది విద్యార్థులు సైతం వస్తున్నారు.  దీంతో ఆయా దేశాలతో భారత్ బంధం బలోపేతం కానుంది.  పది దేశాధినేతలు వస్తుండటంతో అద్భుత ఏర్పాట్లు చేశారు…  బీఎస్ ఎఫ్ నుంచి 113 మంది మహిళలు మోటర్ సైకిల్స్ పై తొలిసారిగా విన్యాసాలు చేయనున్నారు.ఆసియన్కు చెందిన పది దేశాల నుంచి పదిమంది నాయకులను ఈ సంవత్సరం గణతంత్ర వేడుకలకు ఆహ్వానించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆసియన్ సమ్మిట్లో థాయ్లాండ్, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పిన్స్, సింగపూర్, మయన్మార్, కంబోడియా, లావోస్, బ్రెనైకి అనే దేశాలు భాగంగా ఉన్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఈసారి జరగబోయే గణతంత్ర వేడుకలు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటాయి.త్రివిధ దళాలు, పారామిలటరీ ఫోర్సెస్ అద్భుత విన్యాసాలకు రాజ్ పథ్ వేదికకానుంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16209
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author