హైద్రాబాద్ లో ధర్డ్ జెండర్ ఓటర్లు 630

హైద్రాబాద్ లో ధర్డ్ జెండర్ ఓటర్లు 630
January 24 12:57 2018
హైద్రాబాద్,
హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధిలో మొత్తం ఓటర్లు 3806819 మంది ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తేల్చారు. గత సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీ నాటికి నగరంలో మొత్తం 4039638 మంది ఓటర్లుండగా, ఈ నెల 20వ తేదీ నాటికి నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్యను వెల్లడించారు. ఈ సారి ఓటర్ల సంఖ్య 3806819కు తగ్గింది. 4039638గా ఉన్న ఓటర్ల సంఖ్య తగ్గినా, అధికారులు ముసాయిదా జారీ చేయగానే దాదాపు ఓటరు జాబితాలో తమ వివరాలను తేల్చాలంటూ 232819 క్లెయిమ్‌లు వచ్చాయి. ఇవి కలిపిన తర్వాత 3806819 మంది ఓటర్లున్నట్లు తుది జాబితా విడుదల చేశారు.ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ముగియటంతో తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. నగరంలో జనాభా కన్నా ఎక్కువ మంది ఓటర్లున్నట్లు గతంలో లెక్కలు తేలటంతో, అసలు నగరంలో ఎంత మంది ఓటర్లున్నారు? జాబితాలో బోగస్, రిపీట్ ఓట్లను తొలగించేందుకు మరో సారి సవరణ ప్రక్రియను చేపట్టాలని భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల మేరకు అధికారులు ఈ సవరణ ప్రక్రియను చేపట్టారు. ల్యాప్‌ట్యాప్ సహాయంతో ప్రతి ఇంటికెళ్లి అక్కడున్న ఓటర్లను ప్రత్యక్షంగా చూసి, వివరాలను సేకరించాలని, అలాగే బదిలీ అయిన, చనిపోయిన ఓటర్ల వివరాలను తొలగించేలా సవరణ ప్రక్రియ చేపట్టామని అధికారులు చెబుతున్నా, తాజా సవరణలో కొందరు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఓట్లు గల్లంతు చేశారన్న ఆరోపణ ఈసారి కూడా తప్పలేదు. ఎట్టకేలకు సోమవారం తుది జాబితాను విడుదల చేశారు. అధికారుల లెక్కల ప్రకారం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా 3లక్షల 11065 మంది ఓటర్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నట్లు వెల్లడించారు. దాదాపు 3లక్షల 2870 మంది పాతబస్తీలోని యాకుత్‌పురా నియోజకవర్గంలో, సుమారు 2లక్షల 73079 మంది ఓటర్లు నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో, 2లక్షల 66532 మంది మలక్‌పేట నియోజకవర్గంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో అత్యల్పంగా అంటే దాదాపు లక్షా 93907 మంది ఓటర్లు పాతబస్తీలోని చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నట్లు అధికారులు తుది జాబితాలో పేర్కొన్నారు.ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా కాలమ్ నెం.7,12 కింద అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 29928 ఓట్లను తొలగించారు. అత్యల్పంగా చాంద్రాయణగుట్టలో 452 ఓట్లను, ఇదే రకంగా ముషీరాబాద్‌లో 15913, మలక్‌పేటలో 8821, ఖైరతాబాద్ 23442, జూబ్లీహిల్స్‌లో 18847, సనత్‌నగర్‌ల 16వేల 968, నాంపల్లిలో 14614, కార్వాన్‌లో 1897, గోషామహల్ 54221, చార్మినార్ 6503, యాకుత్‌పురా 15739, బహద్దూర్‌పురా 15879, సికిందరాబాద్ 20037, సికిందరాబాద్ కంటోనె్మంట్ నియోజకవర్గంలో వచ్చిన 21942 క్లెయిమ్‌లకు సంబంధించిన ఓట్లను తొలగించటంతో ఓటర్ల సంఖ్య తగ్గింది. అన్ని నియోజకవర్గాల్లో కలిపి 232819 ఓట్లను తొలగించటంతో గత సంవత్సరం సెప్టెంబర్ 9 నాటికి ఉన్న ఓటర్ల సంఖ్య 4039638 కాస్త 3806819కు తగ్గింది. రిపీట్ అయిన, చనిపోయిన ఓటర్ల సంఖ్య తగ్గించటంతో మొత్తం ఓటర్ల సంఖ్య 3806819గా, అందులో పురుషులు 1992120, మహిళ ఓటర్లు 1814069, థర్డ్‌జెండర్ ఓటర్ల సంఖ్య 630గా తేల్చారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16215
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author