పలు కంపెనీలతో మంత్రి కేటీఆర్ భేటీ 

పలు కంపెనీలతో మంత్రి కేటీఆర్ భేటీ 
January 24 17:34 2018
దావోస్,
దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గోంటున్న మంత్రి కెటి రామారావు బుధవారం నాడు రోజు పలు ప్రముఖ కంపెనీలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశాల్లో అయా కంపెనీలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, తెలంగాణలోని పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని మంత్రి వారికి వివరించారు.
ముందుగా  ఎయిర్ ఏషియా గ్రూపు సియివో అంతోనీ ఫెర్నాండెస్ తో భేటీ అయ్యారు. నోవార్టిస్ కార్యకలాపాల విస్తరణకు అంగీకారం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం ఉన్న ల్యాబోరేటరీ వ్యవస్థను, దాని సిబ్బందిని రెట్టింపు చేస్తామని కంపెనీ అంగీకరించింది. నోవార్టిస్ కు నగరంలో అర్ అండ్ డి సెంటర్, డాటా  సపోర్ట్ మరియు అనాలిటిక్స్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నదని, హైదరాబాద్ నగరంలో సంస్ధ అభివృద్ది పట్ల తాము సంతృప్తిగా ఉన్నామని లక్స్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 90 వేల చదరపు అడుగుల ల్యాబోరేటరీని రెట్టింపు చేయనున్నట్లు, కొత్త సూమారు మరో 150 మంది  పరిశోధన సిబ్బందిని నియమించుకోనున్నట్లు తెలిపారు.  కంపెనీ విస్తరణ జీనోమ్ వ్యాలీ అభివృద్దికి దోహాదం చేస్తుందని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఫార్మసిటీ గురించి వివరించారు. నగరం ఇప్పటికే భారతదేశ లైఫ్ సైన్సెస్ క్యాపిటల్ గా ఉన్నాదన్నారు.  తరువాత కేటీఅర్  మిత్సుబిషి హెవీ ఇండస్ర్టీస్ కార్యనిర్వహాక ఉపాద్యక్షులు  కెన్ కవాయి బృందంతో సమావేశం అయ్యారు. జపనీస్ స్మాల్ అండ్ మిడియం  ఎంటర్ ప్రైజేస్ పార్క్ ఎర్పాటు  చేయాలని మంత్రి కోరారు.  ముఖ్యంగా పారిశ్రామిక వాడలు, వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రాజెక్టులు తదితర ప్రాజెక్టులపైన మిత్సుబిషికి ఆసక్తి ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రాజెక్టులకు నిర్మాణానికి తమ రాష్ర్టంలో అనేక అవకాశాలున్నాయని, కంపెనీ ప్రతినిధి బృందం స్వయంగా తెలంగాణలో పర్యటించాలని కోరారు. మెన్నటి జపాన్ పర్యటనలో ఇలాంటి పార్కుకు జైకా వంటి అర్ధిక సంస్ధలు నిధులు అందించేందుకు సూత్రప్రాయంగా ఒప్పుకున్నాయని మంత్రి తెలిపారు.
తరువాత కువైట్ కు చెందిన ఫవద్ అల్గానిమ్ కంపెనీ సియివోతో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణ ఇప్పటికే సోలార్ విద్యుత్పాదనలో అగ్రస్ధానంలో ఉందన్నారు. ఈ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మంత్రి వివరించారు.   రాష్ర్టంలో పవర్, మెడికల్ డివైజేస్ మాన్యూఫాక్చరింగ్ రంగాల్లో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వివరించారు.   వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో సర్కూలర్ అవార్డు గెలుచుకున్న టిహబ్ సంస్ధ బనయన్ నేషన్ సహావ్యవస్ధాపకుడు మనివాజిపేయ్ మంత్రిని కలిసారు. ఈ సందర్భంగా మంత్రి కెటి రామరావు మని బృందానికి అభినందనలు తెలిపారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16268
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author