సినిమా సెగలు

సినిమా సెగలు
January 24 17:51 2018
కృష్ణా,
పద్మావత్ సినిమా సెగలు బెజవాడను సైతం తాకాయి. సినిమా బ్యాన్ చేయాలంటూ భారతీయ జనతా పార్టీ యువమోర్చ ఆధ్వర్యంలో ఆందోళన చేసారు. నగరంలోని ధర్నా చౌక్ లో నిరసన తెలిపారు. చరిత్రను వక్రీకరిస్తూ నిర్మించిన సినిమాను విడుదల అవ్వకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఈ సినిమా ఉందని అభ్యంతరాలు వ్యక్తంచేశారు. స్టార్ డైరక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావతి చిత్రం కాంట్రవర్సీకి కేంద్రంగా మారింది. సెన్సార్ బోర్డు సూచనలకు చిత్రబృందం అంగీకరించడంతో ఈ పీరియాడికల్ డ్రామాకు తెరపై కనిపించే యోగం లభించింది. ఈ సినిమాపై అలముకున్న వివాదాల నేపథ్యంలోనే బోర్డు పద్మావతి టైటిల్ ను కాస్తా పద్మావత్ గా మార్చాలని సూచించింది. బాలారిష్టాలు దాటుకుని జనవరి 25న విడుదలకానున్న ఈ చిత్రానికి నిరసనల సెగ సమసిపోలేదు. ఉత్తర భారత్ లోనే కాక దక్షిణ భారత్ లోనూ ఆందోళనలు ఎగసిపడుతున్నాయి. పద్మావత్ ను బ్యాన్ చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
రాజ్‌పుత్‌ రాజకుటుంబానికి చెందిన ‘పద్మావతి’ క్యారెక్టర్‌ కేవలం కల్పిత గాధనేది మెజారిటీ చరిత్రకారుల అభిప్రాయం. చిత్తార్‌గఢ్‌ రాజు రావల్‌ రతన్‌ సింగ్‌ భార్య అయిన పద్మావతిని దక్కించుకునేందుకు 1303లో అల్లావుద్ధీన్ ఖిల్జీ చిత్తోర్ ఘడ్ పై దండయాత్ర చేశాడు. ఈ హోరాహోరీ పోరాటంలో తన భర్తతో సహా రాజకుటుంబీకులు మరణించారన్న వార్త తెలిసి, తోటి అంత:పుర స్త్రీలతో కలసి రాణి పద్మావతి సామూహిక ఆత్మాహుతికి పాల్పడింది. ఈ టైమ్ లైన్ పై చరిత్రకారుల్లో ఏకాభిప్రాయంలేదు. అయితే పద్మావతి ఆత్మత్యాగం గురించి మాత్రం 1540ల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. రాణి పద్మావతి జీవిత చరిత్ర సినిమా రావడం ఇదే తొలిసారి కాదు. 1960ల్లోనే పలు చిత్రాలు రూపొందాయి. ఓ టీవీ సీరియల్ సైతం బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అయితే సంజయ్ లీలాభన్సాలీ తెరకెక్కిస్తున్న చిత్రమే వివాదాస్పదమైంది. సినిమా విభాగంలో స్వేచ్ఛ ఎక్కువ. అందుబాటులో ఉన్న సమాచారానికి కొంత ఊహ, సృజనాత్మకత జోడించి.. చారిత్రాత్మక కథాంశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకులు. ఈ స్వేచ్ఛతోనే పద్మావతి జీవితానికి తప్పుడు వివరాలు జోడిస్తారేమోనన్న భయం రాజ్ పుత్ లను వెన్నాడుతోంది. అందుకే ఈ చిత్రాన్ని వివాదాలు కమ్ముకున్నాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16281
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author