ఇండియా చరిత్రలోనే రిపబ్లిక్ రికార్డ్ 

ఇండియా చరిత్రలోనే రిపబ్లిక్ రికార్డ్ 
January 24 20:26 2018
న్యూఢిల్లీ,
భారతవని గణతంత్ర దినోత్సవ వేడుకలకు సన్నద్ధం అవుతోంది. ఈ వేడులకు ఆసియాన్ దేశాల అధినేతలు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. 1950 జనవరి 26న తొలి రిపబ్లిక్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేసియా అధినేత సుకర్ణో హాజరయ్యారు. మళ్లీ ఇన్నేళ్లకు ఇండోనేసియా అధ్యక్షుడు రిపబ్లిక్ డే వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ ఏడాది 9 మంది ఆసియాన్ దేశాధినేతలతోపాటు జొకో విడోడో భారత రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంటున్నారు.యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా నరేంద్ర మోదీ సర్కారు 10 మంది ఆసియాన్ దేశాల అధినేతలను రిపబ్లిక్ డే వేడుకల కోసం ఆహ్వానించింది. గణతంత్ర వేడుకలకు ఇప్పటి వరకూ ఇద్దరి కంటే ఎక్కువ మందిని అతిథులుగా ఆహ్వానించని భారత్.. ఈసారి ఏకంగా పది మందికి ఆతిథ్యం ఇస్తోందని మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ చెప్పారు.మయన్మార్ కౌన్సెలర్ ఆంగ్ సాన్ సూకీ, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో, సింగపూర్ ప్రధాని లీ సిన్ లూంగ్, మలేసియా ప్రధాని నజీబ్ రజాక్, థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్ ఓ చా, వియత్నాం ప్రధాని ఎన్‌గ్యుయెన్ జువాన్ ఫ్యుసి, ఫిలిఫ్ఫిన్స్ ప్రెసిడెంట్ రోడ్రిగో డ్యుటెర్టె, కంబోడియా ప్రధాని హున్ సెన్, లావోస్ ప్రధాని థాంగ్లోవున్ సిసోయులిత్, బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియా రాజ్‌పథ్‌లో జరగనున్న రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంటారు.రిపబ్లిక్ డే వేడుకల్లో భారత త్రివర్ణ పతాకంతోపాటు పది ఆసియాన్ దేశాల జెండాలను 90 నిమిషాలపాటు సైన్యం ప్రదర్శించనుంది. పెరేడ్‌లో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులు, ఆకాశ్ క్షిపణులను ప్రదర్శనకు ఉంచుతారు. బీఎస్ఎఫ్ మహిళా విభాగం నారీశక్తి పేరిట మోటార్ సైకిళ్లపై విన్యాసాలు చేపట్టారురేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015 రిపబ్లిక్ వేడులకు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, 2016లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే, 2017లో యూఏఈ యువరాజు మహ్మద్ బిన్ జయీద్ అల్ నయన్‌ను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. ఇక ఆసియాన్ దేశాల సదస్సు 2018 ఢిల్లీ వేదికగా ఈ నెల 24 నుంచి 26 వరకు జరగనుంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16298
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author