ఇన్ స్ట్రా గ్రామ్ లో మహేష్ బాబు

ఇన్ స్ట్రా గ్రామ్ లో మహేష్ బాబు
January 24 20:41 2018
హైద్రాబాద్,
టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు చాలా త‌క్కువ‌గా మాట్లాడ‌తాడు అనే విష‌యం అంద‌రికి తెలిసిందే. అయితే సోష‌ల్ మీడియాలో అప్పుడ‌ప్పుడు త‌న సినిమాల‌కి సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు ఫ్యామిలీ టూర్స్ విష‌యాల‌ను కూడా అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ ఉంటాడు. ట్విట్ట‌ర్‌లో ఎక్కువ‌గా యాక్టివ్‌గా ఉండే మ‌హేష్ బాబు రీసెంట్‌గా ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతా తెరిచాడు. ఈ మ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీలు అంద‌రు ఎక్కువ‌గా ఇన్‌స్ట్రాగ్రామ్‌ని ఉప‌యోగిస్తుండ‌గా, ఇందులో ప‌ర్స‌న‌ల్ లైఫ్ లేదా సినిమాల‌కి సంబంధించిన ఫోటోలు , వీడియోలు షేర్ చేస్తున్నారు. రీసెంట్‌గా అల్లు అర్జున్ త‌న కూతురి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఇన్‌స్ట్రాగ్రామ్ ఎకౌంట్ ఓపెన్ చేశాడు. మ‌హేష్ వైఫ్ న‌మ్ర‌త ఎప్పుడో ఇన్‌స్ట్రాగ్ర‌మ్ ఎకౌంట్ ఓపెన్ చేయ‌గా, మ‌హేష్ మాత్రం రీసెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. మ‌హేష్ అలా ఓపెన్ చేశాడో లేదో ఫాలోవ‌ర్స్ సంఖ్య ఒక్క‌సారిగా పెరిగింది. రానున్న రోజుల‌లో ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా అభిమానుల‌కి మ‌హేష్ మంచి స్ట‌ఫ్ ఇవ్వ‌నున్నాడ‌ని భావించ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాను చేస్తోన్న మహేష్ ఇందులో ముఖ్య‌మంత్రిగా క‌నిపించ‌నున్నాడు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16304
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author