కృష్ణకుమారి కన్నుమూత

కృష్ణకుమారి కన్నుమూత
January 24 20:48 2018
హైద్రాబాద్,
అలనాటి అందాల నటి, నాటి దక్షిణాది సూపర్ స్టార్లందరి సరసనా హీరోయిన్ గా నటించిన కృష్ణకుమారి(84) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. తెలుగులో వందకు పైగా సినిమాల్లో నటించారామె. తమిళ, కన్నడ భాషల్లో కూడా పలు సినిమాల్లో నటించారు కృష్ణకుమారి. ఆమె మరణం సినీ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది.కృష్ణకుమారి రాజమండ్రికి చెందిన వారు. అయితే వారి కుటుంబం పశ్చిమబెంగాల్ లోని నైహతీకి వలస వెళ్లింది. కృష్ణకుమారికి మరో వెటరన్ నటి షావుకారు జానకి అక్క వరస అవుతుంది. ‘నవ్వితే నవరత్నాలు’ అనే సినిమాతో కృష్ణకుమారి తొలిసారి తెరపై అగుపించారు. ఆ తర్వాత అనేక విజయవంతమైన సినిమాల్లో నటించారు.పాతాళభైరవి’లో ఆమె గంధర్వకాంతగా కనిపిస్తారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, రాజ్ కుమార్, శివాజీగణేషన్, జగ్గయ్య తదితర నాటి స్టార్ల సరసన ఆమె హీరోయిన్ గా నటించారు. తెలుగులో సుమారు 130 సినిమాల్లో నటించిన కృష్ణకుమారి, తమిళంలో ముప్పై సినిమాల వరకూ నటించారు. వివాహానంతరం ఆమె తెరకు దూరమయ్యారు. హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఆపై తెరపై నుంచి మాయమయ్యారు.బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్ ను ఆమె వివాహమాడారు. వీరికి ఒక కుతూరు ఉంది. పిచ్చిపుల్లయ్య, కులగోత్రాలు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, అంతస్తులు, చిక్కడూ దొరకడు, బందిపోటు, మానవుడు దానవుడు.. కృష్ణకుమారి నటించిన విజయవంతమైన చిత్రాలు. నటిగా ఆమె అనేక అవార్డులను పొందారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16307
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author