ఓటు హక్కుపై అవగాహన వుండాలి

ఓటు హక్కుపై అవగాహన వుండాలి
January 25 18:16 2018
హైదరాబాద్,
భారత ప్రజాస్వామ్యంలో  ఓటర్ల దినోత్సవం ముఖ్యమైనది. ఓటు మంచి ప్రభుత్వం ను ఏన్నుకోవడానికి ఉన్న ఏకైక అస్త్రం. భారత రాజ్యంగంలో ఏలక్షన్ కమీషన్ 5 పిల్లర్. మీరు ఏలాంటి ప్రలోభాలకు లోంగకుండ ఓటు వేసినట్లు అయితె మంచి వ్యక్తులు చట్టసభల్లోకి వస్తారు, పనులు చేయకుంటే దైర్యం గా ప్రజలు  ప్రశ్నించవచ్చని గవర్నర్ నరసింహన్ అన్నారు.
నువ్వొక్కడివి ఓటు వేయకపోతే వచ్చే నష్టమేమీ ఉండదని అనుకోవద్దు.నీ స్వరం వినిపించినా పెద్దగా ఉపయోగం ఉండదని ఎవరైనా అంటే నమ్మవద్దు.నీ ఒక్కడి ఓటూ చరిత్రను మార్చగలదు.నీ స్వరం కొన్నిలక్షల మంది ఆలోచనల్ని ప్రభావితం చేయగలదని అన్నారు.
గురువారం నాడు హైదరాబాద్ రవీంద్రభారతీలో జరిగిన ఓటర్ల దినోత్సవం వేడుకల్లో అయన ముఖ్య అతిధిగా పాల్గోన్నారు.
సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రజలు ఎలక్షన్లలో విధిగా తమ బాధ్యతను వహించాలి. ప్రతీ ఒక్కరు ఓటుహక్కు పై ప్రజలలో అవగహన కల్పించాలి ఓటు విలువ వారికి తెలియజేయాలి.  ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటేనే మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది. మంచి సమాజం గా మారుతుందని అన్నారు. కార్యక్రమంలో ఓటర్ల నమోదు ప్రక్రియకు విశేష సేవలందించిన జిల్లా కలెక్టర్లు, వ్యాస రచనా పోటీలో విజేతనలకు అవార్డులు, మెమెంటోలు బహుకరించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16351
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author