సీబీఐకు కొత్త జాయింట్ డైరెక్టర్లు

 సీబీఐకు కొత్త జాయింట్ డైరెక్టర్లు
January 25 18:27 2018
న్యూఢిల్లీ,
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు కొత్త జాయింట్ డైరెక్టర్లను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు  ఆరుగురు ఏసీఎస్ అధికారుల పేర్లను గురువారం విడుదల చేసింది. ఐపీఎస్ అధికారులు శరద్ అగర్వాల్, గజేంద్ర కుమార్ గోస్వామి, వీ మురుగేశన్, ప్రవీణ్ సిన్హా, అజయ్ భట్నాగర్,  పంకజ్ కుమార్   శ్రీవాస్తవలను నూతన జాయింట్ డైరెక్టర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 1998 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన శరద్ అగర్వాల్ ప్రస్తుతం విజిలెన్స్ కమిషన్కు అదనపు కార్యదర్శిగా ఉన్నారు. అజయ్ భట్నాగర్ సీఆర్పీఎఫ్ ఐజీగా విధులు నిర్వహించారు. కొత్త జేడీల పేర్ల జాబితాతోపాటు వారి వారి పదవీకాలం పూర్తయ్యే వివరాలను కూడా కేంద్రం ప్రకటనలో స్పష్టం చేసింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16358
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author