ఓటరు చైతన్యంతోనే ప్రజాస్వామ్యానికి మనుగడ

ఓటరు చైతన్యంతోనే ప్రజాస్వామ్యానికి మనుగడ
January 25 21:57 2018
రంగారెడ్డి
ఓటరు చైతన్యంతోనే ప్రజాస్వామ్యం  మనుగడ సాదిస్తుందని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం శంకర్‌పల్లిలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో 8వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు భారత ప్రజాస్వామ్యం,  తెలంగాణ ఓటర్లు చైతన్యానికి రోల్ మోడల్ అన్నారు. 18సంవత్సరాలు నిండిన యువత స్వచ్ఛందంగా ఓటరుగా నమోదు చేసుకొని ఎన్నికల సమయంలో ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలన్నారు.
అనంతరం శంకర్ పల్లిలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ భూనిర్వాసితులకు రూ. 7 కోట్ల 65లక్షల పరిహారాన్ని మంత్రి పంపిణీ చేశారు. ఎకరాకు రూ. 24లక్షలతో 33మంది కొండకల్ రైతులకు మంత్రి పరిహారం అందించారు. రూ. 800 కోట్లతో పీపీపీ మోడల్ ద్వారా చేపట్టే రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి 100ఎకరాల భూసేకరణలో రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో50 ఎకరాలు సేకరించామని మంత్రి తెలియజేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ద్వారా స్థానికంగా 1000 మంది ఉపాధి పొందుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి,  ఆర్డీవో పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16391
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author