అవ్రామ్ భక్త ఫోటో వైరల్

అవ్రామ్ భక్త ఫోటో వైరల్
January 27 11:31 2018
హైద్రాబాద్,
సొట్ట బుగ్గలతో ముద్దులొలుకుతూ.. చిరు నవ్వులు చిందిస్తున్న మంచు వారసుడిని చూస్తే మురిసిపోకమానరు. ఈ ముద్దులొలికే చిన్నారి బాబు మంచు విష్ణు, విరోనికా రెడ్డి దంపతుల గారాల పుత్రుడు. కొత్త ఏడాది తొలి రోజుల పుట్టిన మంచు వారసుడికి ‘అవ్రామ్ భక్త’ అనే పేరుని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. నూతన ఏడాదిలో తమ ఇంటికి నూతన శోభను తెచ్చిన మంచు వారసుడి తొలి ఫోటోను మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.అచ్చం తండ్రి పోలికలతో సొట్ట బుగ్గలేసుకుని పుట్టిన మంచు వారసుడు ‘అవ్రామ్ భక్త’ చూసి తెగ మురిసిపోతున్నారు ఆయన అభిమానులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘అవ్రామ్ భక్త’ ఫోటో వైరల్‌గా మారింది. ‘అవ్రామ్ భక్త’ అంటే ఎవరూ ఆపలేరని అర్థాన్ని చెప్పుకొచ్చిన విష్ణు.. తన ముద్దుల కొడుకు తొలి ఫోటోకి వస్తున్న రెస్పాన్స్ కూడా ఎవరూ ఆపలేనిదిగానే ఉంది.కాగా విష్ణు, విరోనికా రెడ్డి దంపతులకు డిసెంబర్ 2011లో కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. తరచూ మోహన్ బాబు ఈ కవలల తోటే సినిమా ఫంక్షన్స్‌కి హాజరౌతుంటారు. కాగా తమ కుటుంబంలోకి కొత్త వారసుడు రావడంతో మంచు వారి ఇంట ఆనందానికి అవధులు లేవు.ఇక మంచు విష్ణు- ప్రగ్యా జైశ్వాల్‌ జోడిగా నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ విడుదలైంది. అయితే తన భార్య డెలివరీ కారణంగా ప్రమోషన్స్ వర్క్‌తో పాటు సినిమాను కూడా వాయిదా వేసుకున్నారు మంచు విష్ణు. జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16417
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author