హత్యా రాజకీయాలు కాంగ్రెస్ కు అలవాటే  

హత్యా రాజకీయాలు కాంగ్రెస్ కు అలవాటే  
January 27 18:54 2018
హైదరాబాద్,
రాష్ట్రం లో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా దాన్నితెరాస కు ఆపాదించడం కాంగ్రెస్ కు అలవాటు గా మారింది. గ్రెస్ నీచ ,దివాళాకోరు రాజకీయాల కు పాల్పడుతోందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ,ఎమ్మెల్యే గాదరి కిషోర్ మండిపడ్డారు. శనివారం నాడు వారు మీడియా సమావేశం నిర్వహంచారు. నల్లగొండలో బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు తెరాస కు ఎలాంటి సంబంధం లేదు. శ్రీనివాస్ హత్యకు జిల్లా మంత్రి ,ఎమ్మెల్యే వీరేశం, చివరకు సీఎం కెసిఆర్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేతలు కోరడం వారి పిచ్చితనానికి నిదర్శనమని అన్నారు. శ్రీనివాస్ హత్య పై న్యాయ విచారణ జరగాలని తెరాస శాసనసభా పక్షాన డిమాండ్ చేస్తున్నాం. శ్రీనివాస్ గత సంవత్సర కాలం గా ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడారో లిస్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. .ఎమ్మెల్యే వీరేశం ఫోన్ కాల్స్ లిస్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఫోన్ కాల్స్ లిస్ట్ కూడా బయట పెట్టమనాలి. మా ఎమ్మెల్యే వీరేశం ఫోన్ కాల్ లిస్ట్ బయట పెట్టేందుకు అభ్యంతరం లేదు. శ్రీనివాస్ కోమటి రెడ్డి వెంకట రెడ్డి అనుంగు శిష్యుడని అన్నారు. శ్రీనివాస్ నిందితులు అంతా కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలంగా ఉన్నారు  ఫోటో లే విచారణకు ప్రామాణికమైతే నిందితులందరూ కోమటి రెడ్డి తో ఫోటో లు దిగారని అన్నారు. ఎమ్మెల్యే వీరేశం తో నిందితులు దిగిన ఫోటో ఆయన పీజీ పరీక్ష రాసేందుకు వచ్చినపుడు కాలేజ్ వద్ద దిగింది. యువ శాసన సభ్యుడు కాబట్టి వీరేశం తో ఫోటోలు దిగేందుకు ఉత్సుకత ఉంటుంది. నింధితుడు రాంబాబు ను కోమటి రెడ్డి పామును పెంచినట్టు పెంచారు . రాంబాబు పై చాలా కేసులు ఉన్నాయని వారన్నారు. నిజాలు నిగ్గు తేల్చేందుకు ఏవిచారణ సంస్థ తో విచారణ జరిపినా మాకు అభ్యంతరం లేదని స్పష్టం చేసారు.  అసలు హత్యా రాజకీయాలు మొదట్నుంచి కాంగ్రెస్ కు అలవాటే. తెరాస వాటికి పూర్తి వ్యతిరేకమని వారన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16455
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author