కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు

కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు
January 27 19:36 2018
హైదరాబాద్,
ప్రజాస్వామ్యంపై సీఎం   కేసీఆర్ కు గౌరవం లేదు. రాజ్యాంగ పరంగా ఉండే హక్కుల్ని కాలరాసే హక్కు కేసీఆర్ కు లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ప్రజలు తమ స్వేచ్ఛను వ్యక్తపరిచే హక్కును కేసీఆర్ కాలరాస్తున్నారని ఆరోపించారు. ప్రజలను అణచివేసే చట్టాల విషయంలో ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని, ప్రజావ్యతిరేక చట్టాలు ప్రజాక్షేత్రంలో నిలబడవని శ్రవణ్ పేర్కొన్నారు.  506,507 ఐపీసీ సెక్షన్ల మార్పుకి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని అయన అన్నారు. శాశ్వతమైన వ్యవస్థలని నిర్వీర్యం చేసేలాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పరుషాపదజాలంతో దూషిస్తే కోర్ట్ అనుమతి లేకుండా పోలీసులకి విచారించే హక్కు కోసం ఈ ప్రభుత్వం ప్రజా హక్కులను హారిస్తుంది. రేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు స్పందించిన విచారణ పేరుతో హింసించే వైఖరిని ఈ ప్రభుత్వం చేస్తుందని అయన హెచ్చరించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టే ఉషయంలో కొత్త చట్టాలను తీసుకురండి. ప్రజలను అణిచివేసే లాగా ఇలాంటి చట్టాలను మార్చే విషయంలో ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని అయన సూచించారు.  మీరు ప్రజలకి మేలు చేయాలనుకుంటే మహిళల్ని ఆట బొమ్మలుగా అసభ్యంగా చిత్రీకరిస్తున్న రామ్ గోపాల్ పైన కేస్ పెట్టండని అన్నారు. ఈ రోజు సోషల్ మీడియా లో ప్రజలు తమ  స్వేచ్ఛను వ్యక్తపరిచే హక్కును ఈ ప్రభుత్వం కాల రాస్తుంది. రానున్న రోజుల్లో ప్రజలతో కలిసి, బయట, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నిర్వహిస్తామని అయన అన్నారు.  ఇలాంటి ప్రజా వ్యతిరేక చట్టాలు ప్రజాక్షేత్రం లో నిలబడవు.  సన్నాసి,దద్దమ్మలు, అంటూ పరుష పదజాలం ఉపయోగించే సీఎం కేసీఆర్ మాటలు ,టీఆరెస్ ప్రభుత్వ ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు ఏమిటని అయన ప్రశ్నించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16471
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author