ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకొన్న  మేయర్

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకొన్న  మేయర్
January 27 19:45 2018
విజయవాడ,
ప్రజలందరు కార్పోరేట్ హాస్పిటల్స్ దారిపడుతున్న సమయంలో… ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో ఉన్న అభద్రత భావని తొలగించేందుకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిని ఎంచుకొన్నానని విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ తెలిపారు.
గతంలో వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మోకీలు మార్పిడి చేయించుకొని ప్రజాప్రతినిధులకు అదర్శంగా మారారని వారి స్పూర్తితోనే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో శనివారం కంటి శస్త్ర చికిత్స చేయించుకొన్నట్లు మేయర్ కోనేరు శ్రీధర్ తెలిపారు.  విజయవాడ మేయర్ గా పనిచేస్తున్న నేను… ప్రైవేట్ ఆసుపత్రులలో చేయించుకొనే స్ధోమత ఉన్నప్పటికి ప్రభుత్వాసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు మేయర్ కోనేరు శ్రీధర్ తెలిపారు. రోగి ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఇంటికి వెళ్లే వరకు పైసా ఖర్చు లేకుండా శస్త్ర చికిత్సలు ప్రభుత్వాసుపత్రిలో నిర్వహిస్తున్నట్లు మేయర్  తెలిపారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16477
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author