అమ్మో క్షయ 

అమ్మో క్షయ 
January 29 11:29 2018
మహబూబ్ నగర్,
జిల్లాలో క్షయవ్యాధి ఆందోళన కలిగిస్తోంది. చిన్నపిల్లల నుంచి పెద్దలదాకా దీని బారిన పడుతున్నారు. సరైన సమయంలో వైద్యం తీసుకోకపోవడం ఒక కారణమైతే, ఇచ్చిన మందులు వేసుకోక తిరగబెట్టిన వారు మరికొందరున్నారు. ఒకరి నుంచి ఇంకొకరికి సులువుగా ఇది సోకుతుండటంతో ఎక్కువ మంది వ్యాది బారిన పడుతున్నారు.
పాలమూరు ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడే పర్యవేక్షణ అంతంత మాత్రమే ఉండేది. ప్రస్తుతం విభజన తర్వాత కొత్త జిల్లాల్లో వ్యాధి నియంత్రణ చర్యలు ఆశించినంత మేర జరగడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో క్షయ బాధితులకు సరైన సేవలూ అందడం లేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వివరాలు సైతం అందుబాటులో లేవు. ఒకప్పుడు క్షయ బాధితుల సంఖ్య జిల్లాలో తక్కువగా ఉండేది. అయిదేళ్లుగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఉమ్మడి జిల్లాలో 2016లో 3,980 కేసులుంటే, 2017లో 4187 నమోదయ్యాయి. ఒక్క మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే ఈ కార్యక్రమం కొంత పకడ్బందీగా సాగుతోంది.
జిల్లాల విభజన తర్వాత క్షయ బాధితులకు అందుతున్న సేవలు గందరగోళంగా మారాయి. కొత్తగా ఏర్పాటైన వనపర్తి, నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల జిల్లాల్లో సుమారు 2,500 మంది బాధితులున్నారు. ఇక్కడ క్షయ నియంత్రణ అధికారులను నియమించారు. వీరికి ప్రత్యేక కార్యాలయాలు, అవసరమైన సిబ్బంది లేరు. దీంతో పర్యవేక్షణ.. వివరాల సేకరణ కొంత సమస్యగా మారింది. బాధితులు కనీసం మందులు వేసుకుంటున్నారా.. లేదా.. అనే విషయాలనూ పరిశీలించడం లేదు. ఎంత మంది బాధితులున్నారో స్పష్టమైన వివరాలు అందుబాటులో లేవు. క్షేత్రస్థాయిలో సిబ్బందిపై పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టమున్నట్లు పనిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి వద్ద మందులకు లొంగని క్షయ బాధితులకు వైద్యసేవలు అందించేందుకు వసతుల్లేవు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో మాత్రమే ఉంది.
 క్షయ ఒకరి నుంచి ఒకరికి సుమారు 10- 15 మందికి సోకుతుంది. ఒక్క రోగి దగ్గితే 40 వేల దాకా వ్యాధికారక క్రిములు గాల్లో కలుస్తాయి. క్షయవ్యాధి ­పిరితిత్తులకే కాదు.. శరీరంలోని ప్రతి అవయవానికి సోకుతుంది. మెదడు, ఎముకలు, పేగులు, గుండే, కాలేయం వంటి వాటికి సైతం సొకే అవకాశం ఉంటుంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16516
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author