జన జాతరకు అంతా సిద్ధం

జన జాతరకు అంతా సిద్ధం
January 30 11:03 2018
వరంగల్ ,
నాలుగు రోజుల పాటు జరిగే జన జాతర కు అంతా సిద్ధమైంది. దూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకుని వనదేవతలను దర్శించుకుంటారు. 36 ఏళ్ల క్రితం ములుకనూరులో ప్రారంభమైన జాతరకు లక్షలాదిమంది భక్తులు వస్తుంటారు. అమ్మవార్లను దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త్లకుండా  పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.31వ తేదీన సారలమ్మ గద్దెకు వస్తుంది. ఫిబ్రవరి ఒకటవ తే దీన సమ్మక్క గద్దెకు రావడం, రెండో తేదీన మొక్కులు సమర్పించడం, మూడో తేదీన తిరిగి వనప్రవేశం జరుగుతాయి.నాలుగు రోజుల పాటు మేడారం చీమలదండులా మారుతున్నది. తాత్కాలిక గుడారాలు, లెక్కకు మిక్కిలి వాహనాలతో మేడారం మహానగరాన్ని తలపిస్తున్నది. కోటిమంది భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క-సారలమ్మ మహాజాతర ప్రారంభం కానుండవతో పిల్లాపాపలతో వనదేవతలను దర్శించుకొనేందుకు పయనమవుతున్నారు. మహాజాతర బుధవారం నుంచి శనివారం వరకు అంగరంగ వైభవంగా జరుగనున్నది. బుధవారం సాయంత్రానికి కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు ఇప్పటికే పయనమయ్యారు. వీళ్లు కూడా బుధవారం రాత్రి గద్దెల ప్రాంగణానికి చేరుకోనున్నారు. అప్పటి నుంచి జాతర అధికారికంగా ప్రారంభమవుతుం ది. గురువారం సాయంత్రం చిలుకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెలపైకి చేరితే సకల వన దేవతలు కొలువైనట్టే. ఇప్పటినుంచే ఇసుకేస్తే రాలనంతగా మేడారం వనమంతా జనంతో నిండిపోతునున్నది. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా మేడారం చేరుకునే రహదారి పొడవునా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తులు ప్రైవేటు వాహనాల ద్వారా వచ్చి వెళ్లేందుకు ఆదివారం నుంచి వన్‌వే విధానాన్ని అమలుచేస్తున్నారు. 20 రోజుల ముందు నుంచే భక్తులు పెద్దసంఖ్యలో మేడారం వస్తున్నారు. ఆదివారం అత్యధికంగా 12లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు.వారం రోజులుగా మేడారంలోనే మకాం వేసిన ఉన్నతాధికారులు భక్తుల కల్పించే ఏర్పాట్లు, భద్రతపై నిరంతరం సమీక్షిసున్నారు. 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జాతర నిర్వహణలో కీలకపాత్ర పోషించే పోలీసుశాఖ, 15 వేల మంది సిబ్బందితో బందోబస్తుకు ప్రణాళిక రచించింది. 12 వేల మంది సిబ్బందితో 4200 బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. జాతర విధులు నిర్వర్తించే సిబ్బంది మొత్తం సోమవారమే మేడారం చేరుకున్నారు. జంపన్నవాగు, అమ్మవార్ల గద్దెల ప్రాంగణం, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పోలీసులు విధుల్లో చేరారు. నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి, కరీంనగర్ డీఐజీ రవివర్మ, జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్ సోమవారం మేడారంలో పర్యటించారు. సీసీ, క్రౌడ్‌కౌంటింగ్, మానిటరింగ్ కెమెరాలను పరిశీలించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి ఓరం పర్యటన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష చేశారు.ఇన్‌చార్జి కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జేసీ అమయ్‌కుమార్, ఏటూరునాగారం ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు మేడారంలోనే మకాంవేసి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సోమవారం కలెక్టర్ కర్ణన్ బుల్లెట్‌పై ఏర్పాట్లను పరిశీలించారు.భక్తులు పుణ్యస్నానాలు చేయటానికి లక్నవరం సరస్సు నుంచి విడుదలచేసిన నీరు జంపన్నవాగులోకి చేరింది. ఇక్కడ మహిళలు దుస్తులు మార్చుకోవడానికి 132 తాత్కాలిక గదులను సిద్ధం చేశారు. మేడారం పరిసరాల్లో 11,250 మరుగుదొడ్లను నిర్మించారు. భక్తులు విడిదిచేసే ప్రదేశాల్లో నల్లాల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం 3,400 మంది నిరంతరం శ్రమిస్తున్నారు. గద్దెల ప్రాంగణం సమీపంలో ప్రారంభించిన 50 పడకల ప్రభుత్వ దవాఖానలో వైద్యులు నిరంతరం సేవలు అందిస్తున్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16572
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author