అత్యధికంగా కండోమ్స్ వినియోగిస్తుంది పెళ్లి కాని అమ్మాయిలే

అత్యధికంగా కండోమ్స్ వినియోగిస్తుంది పెళ్లి కాని అమ్మాయిలే
January 30 14:27 2018
న్యూఢిల్లీ
 గడిచిన దశాబ్ద కాలంలో పెళ్లి కాని అమ్మాయిలే అత్యధికంగా కండోమ్స్ వినియోగించినట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. 2015-16సర్వే ప్రకారం.. పెళ్లి కాని అమ్మాయిలు, మహిళల్లో ఆరు రేట్లు కండోమ్స్ వినియోగం పెరిగినట్లు తేలింది. పదేళ్ల కాలంలోనే 2శాతం నుంచి 12శాతం మంది పెళ్లి కాని అమ్మాయిలు, మహిళలు(15నుంచి 49ఏళ్లు) కండోమ్స్ వాడుతున్నట్లు సర్వే ద్వారా వెల్లడైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వీరిలో అత్యధికంగా 20నుంచి 24 ఏళ్ల యువతులు కండోమ్స్ వాడుతున్నారు.పెళ్లి అయిన చాలా మంది మహిళలు సంప్రదాయ కుటుంబ నియంత్రణకు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. గర్భ నిరోధక పద్ధతులు(76 శాతం మంది మహిళలు) పాటించడంలో పంజాబ్ ప్రథమ స్థానంలో ఉండగా మణిపూర్, బీహార్, మేఘాలయ రాష్ర్టాల్లో 24శాతం చొప్పున గర్భ నిరోధక పద్ధతులు పాటిస్తున్నారు. 34శాతం మంది పెళ్లి కాని అమ్మాయిలు 34 శాతం గర్భ నిరోధన పద్ధతులు పాటిస్తుంటే.. మరో 32 శాతం మంది అమ్మాయిలు.. నెలసరి తర్వాత శృంగారంలో పాల్గొనకుండా ఉంటున్నట్లు సర్వేలో తేలింది. చాలా మంది మహిళలు సంప్రదాయ కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తున్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది.15 నుంచి 19సంవత్సరాల వయస్సున్న పెళ్లి కాని అమ్మాయిలు.. 17.6శాతం మంది గర్భ నిరోధక పద్ధతులు పాటిస్తుంటే.. 15.1 శాతం మంది కండోమ్స్‌ను ఉపయోగిస్తున్నారు. 82.4శాతం అమ్మాయిలు అటు గర్భ నిరోధక పద్ధతులు, ఇటు కండోమ్స్‌ను ఉపయోగించడం లేదు.20 నుంచి 24సంవత్సరాల వయస్సున్న పెళ్లి కాని మహిళలు.. 24;.2శాతం మంది గర్భ నిరోధక పద్ధతులు పాటిస్తుంటే.. 19.7 శాతం మంది కండోమ్స్‌ను ఉపయోగిస్తున్నారు. 75.8 శాతం మహిళలు అటు గర్భ నిరోధక పద్ధతులు, ఇటు కండోమ్స్‌ను ఉపయోగించడం లేదు.
25నుంచి 49 సంవత్సరాల వయస్సున్న పెళ్లి కాని మహిళలు.. 45.3 శాతం మంది గర్భ నిరోధక పద్ధతులు పాటిస్తుంటే..6.5 శాతం మంది కండోమ్స్‌ను ఉపయోగిస్తున్నారు. 54.7శాతం మహిళలు అటు గర్భ నిరోధక పద్ధతులు, ఇటు కండోమ్స్‌ను ఉపయోగించడం లేదు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16581
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author