సినీ నటుడు సామ్రాట్ రెడ్డి ఆరెస్టు

సినీ నటుడు సామ్రాట్ రెడ్డి ఆరెస్టు
January 30 18:41 2018
హైదరాబాద్,
సినీ నటుడు సామ్రాట్రెడ్డిపై మాదాపూర్ పీఎస్లో అతని భార్య హర్షిత తనను వేధిస్తున్నట్లుగా ఫిర్యాదు చేసింది. సామ్రాట్ భార్య చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సామ్రాట్, అతని సోదరి సాహితీరెడ్డిని అరెస్ట్ చేశారు. మాదాపూర్ నెక్టార్ గార్డెన్లోని ఇంట్లో సీసీ కెమెరాలు, ఫర్నీచర్ను ధ్వంసం చేసి, ఇంట్లో ఉన్న నగలను సామ్రాట్ తీసుకెళ్లాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కాగా సామ్రాట్రెడ్డి, అతని భార్య రెండు నెలలుగా విడివిడిగా ఉంటున్నట్లు సమాచారం.
తన భర్తను ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్నానని, అయితే, ఆ తరువాతే అతని నిజస్వరూపం తెలిసిందని హర్షిత ఆరోపించింది. మాదాపూర్ పోలీసులు సామ్రాట్ ను అరెస్ట్ చేసిన తరువాత మీడియాతో మాట్లాడిన ఆమె, తన భర్త చాలా దుర్మార్గుడని సంచలన ఆరోపణలు చేసింది. తన అత్త కూడా ఎంతో వేధించిందని ఆరోపించింది. కట్నం తీసుకురావాలని వేధిస్తున్నందునే గతంలో ఓ కేసు పెట్టానని తెలిపింది. ఇప్పుడు తాజాగా గృహోపకరణాలను, పలు విలువైన వస్తువులను చెప్పకుండా తీసుకు వెళ్లాడని తెలిపింది. మాదాపూర్ పోలీసు ఇన్స్ పెక్టర్ కళింగరావు మాట్లాడుతూ సామ్రాట్ రెడ్డి, అతని భార్య వేరుగా వుంటున్నారని అన్నారు. సంక్రాతి పండగకు హర్షిత సొంత వూరుకు వెళ్లింది. ఆమె లేని సమయంలో సమ్రాట్, అతడి సోదరి  సాహితీ రెడ్డి ఇద్దరు వచ్చి ఇంట్లోని సీసీ కెమెరాలు, ఇంటి తాళాలను ధ్వంసం చేసారని  హర్షిత ఫిర్యాదని అన్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16610
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author