కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉపరాష్ట్రపతి పర్యటన 

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉపరాష్ట్రపతి పర్యటన 
January 30 18:44 2018
అమరావతి
 భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి మూడు రోజులపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నట్లు ప్రభుత్వ అదనపు కార్యదర్శి లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎం.అశోక్ బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన పర్యటన వివరాలు ఈ దిగువ తెలిపిన విధంగా ఉంటాయి.ఫిబ్రవరి 2వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1.55 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన ప్రత్యేక విమానంలో బయలుదేరతారు. సాయంత్రం 4.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ఆయనకు ప్రముఖులు స్వాగతం పలుకుతారు. ఆ తరువాత అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి సాయంత్రం 4.50 గంటలకు విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని శంకర్ నేత్ర చికిత్సాలయానికి చేరుకుంటారు. 5 గంటలకు ఆ చికిత్సాలయాంలో అదనపు సౌకర్యాలను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు ఆత్కూరు గ్రామం చేరుకుంటారు. ఆ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంతోపాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడ నుంచి బయలుదేరి సాయంత్రం 6.50 గంటలకు సర్వర్ణభారతి ట్రస్ట్ చేరుకుంటారు. ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.3వ తేదీ శనివారం ఉదయం 7.45 గంటలకు సర్వర్ణభారతి ట్రస్ట్ నుంచి రోడ్డు మార్గంలో భయలుదేరి 8 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరి 8.30 గంటలకు పెదనందిపాడు హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో 8.50 గంటలకు  పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి చేరుకుంటారు. 9.30 గంటలకు జరిగే కాలేజీ స్వర్ణోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో 10.15 గంటలకు హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలీకాఫ్టర్ లో బయలుదేరి 10.45 గంటలకు గుంటూరులోని ఓమెగా ఆస్పత్రి సమీపంలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో అగతవరప్పాడు ఒమేగా ఆస్పత్రికి చేరుకొని 150 పడకల సూపర్ స్పెషాలిటీ ఆంకాలజీ సెంటర్ ను ప్రారంభిస్తారు. ఆ తరువాత అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 12 గంటలకు జెకెసీ కాలేజీ వద్దకు చేరుకొని నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ స్వర్ణోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొంటారు. జెకెసి కాలేజీ నుంచి 2.15 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలీకాఫ్టర్ లో సాయంత్రం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 3.15 గంటలకు స్వర్ణభారతి ట్రస్ట్ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.4వ తేదీ ఆదివారం ఉదయం 9.30 గంటలకు  స్వర్ణభారతి ట్రస్ట్ నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ ఆయనకు ప్రముఖులు వీడ్కోలు పలుకుతారు. అక్కడ 10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకొని, 12.35 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాసానికి చేరుకుంటారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16613
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author