తెలంగాణ కాంగ్రెస్ లో  జిల్లా అధ్యక్షుల లొల్లి

తెలంగాణ కాంగ్రెస్ లో  జిల్లా అధ్యక్షుల లొల్లి
January 31 11:50 2018
హైద్రాబాద్ ,
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త చిక్కొచ్చి పడింది. అదే డీసీసీల నియామకం. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకొని మూడేళ్లవుతున్నా…ఇప్పటికీ బొత్స సత్యనారాయణ వేసిన కమిటీలే చాలా కొనసాగుతున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత డీసీసీల నియామకం కాంగ్రెస్‌లో సెగ పుట్టిస్తోంది. పట్టుకోసం సీనియర్లు, భవిష్యత్తు కోసం జూనియర్లు తామంటే తామంటూ పోటీ పడుతుండటం పీసీసీకి సవాల్‌గా మారింది. డీసీసీలపై ఇప్పటికే కసరత్తు చేసినా..కొన్ని జిల్లాల్లో సీనియర్ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. తె  డీసీసీల ఎంపిక కసరత్తు కూల్‌కూల్‌గా సాగిపోతుంటే ఉత్తర తెలంగాణలో మాత్రం సెగలు పుట్టిస్తోంది. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లు సీనియర్ల ఆధిపోరుతో పీసీసీ నలిగిపోతుంది. ఇప్పుడు పాత పది జిల్లాలు పక్కనబడితే..కొత్తగా ఏర్పడిన 21 జిల్లాలకు కొత్త డీసీసీల ను నియమించాలని పీసీసీ నిర్ణయించింది. దీంతో పార్టీలో రగడ మొదలైంది. అయితే డీసీసీలుగా పనిచేస్తున్న వారికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండదని ఏఐసీసీ నుంచి సూచనలు రావడంతో మొదట్లో కొంత వెనక్కి తగ్గిన ఆశావాహులు….ఎన్నికల నాటికి ఆ ఫార్ములా ఎలాగూ వర్కవుట్ కాదని అంచనాకొచ్చి ఇప్పుడు జోరు పెంచారు. వీటిలో దక్షిణ తెలంగాణలో పెద్దగా పోటీలేదు. ఆయా జిల్లాలకు చెందిన సీనియర్లు అందరూ కలిసి ఏకాభిప్రాయంతో దాదాపు ఎంపిక పూర్తి చేశారు. అయితే ఇప్పుడు అసలు పంచాయితీ అంతా ఉత్తర తెలంగాణలోనే వచ్చిపడింది. ముఖ్యంగా కరీంనగర్ డీసీసీ నియామకం హాట్‌హాట్‌గా మారింది. ఎలాగైనా డీసీసీని దక్కించుకునేందుకు ఆశావాహులు కుస్తీ పడుతున్నారు. ఇప్పటికే కరీంనగర్ డీసీసీగా పనిచేస్తున్న కటకం మృత్యుంజయం స్థానంలో తనకు అవకాశం కల్పించాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి సోదరుడు కౌశిక్ రెడ్డి అడుగుతున్నారు. కౌశిక్ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇప్పటికే డీసీసీగా ఉన్న మృత్యుంజయాన్నే తిరిగి కొనసాగించాలంటున్నారు. కౌశిక్ మాత్రం జిల్లాలో ఇతర ముఖ్యనేతల మద్దతు తనకే ఉందని చెప్పుకుంటున్నారు. దీంతో పొన్నం-కౌశిక్‌కు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదిలా ఉంటే మాజీ ఎంపీ చొక్కారావు మనువడు నిఖిల్ చక్రవర్తి…బొమ్మ శ్రీరామ్‌లు తాము సైతం రేస్‌లో ఉన్నామంటున్నారు. అంతే కాదు ఎవరికి వారు లాబియింగ్‌ కూడా చేసుకుంటున్నారు.ఇక ఆదిలాబాద్ నుంచి ఏర్పడ్డ కొత్త జిల్లా మంచిర్యాల డీసీసీ ఎంపిక కత్తిమీద సాముగా మారింది. ఇప్పటికే ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్ రావు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి మధ్య నడుస్తున్న వార్‌ పార్టీలో మరింత సెగ రేపుతోంది. ఈ విషయంలో పీసీసీ ముఖ్యనేతలు సైతం రెండుగా చీలిపోయారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉత్తమ్‌, భట్టి విక్రమార్కలు వారి వారి వర్గాలకు ప్రాతినిథ్యం కావాలని ప్టటుబడుతుండటంతో సీన్‌ రంజుగా మారింది. ఈ ఇఘ్యాతో ఉత్తమ్‌, భట్టీలు ఎవరికి వారు పట్టుదలతో ఉన్నారన్న చర్చ పార్టీలో సాగుతోంది. మరో వైపు పాత వరంగల్ డీసీసీ పరిస్ధితి కూడా సేమ్‌ టూ సేమ్… కొత్తగా ఏర్పాటైన భూపాలపల్లి జిల్లా అధ్యక్ష పదవి తన భార్య గండ్ర జ్యోతికి కావాలని మాజీ చీఫ్ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అడుగుతున్నారు. అయితే ఆమెకు వ్యతిరేకంగా కొంతమంది నేతలు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఇక వరంగల్ అర్బన్‌లో ఎర్రబెల్లి స్వర్ణ…దయాసాగర్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక వరంగల్ రూరల్‌లో పరకాల వెంకట్రామిరెడ్డి డీసీసీ పదవి ఆశిస్తున్నారు. ఇదీలా ఉంటే మహబూబ్‌బాద్‌లో డీసీసీని ఇప్పటికే పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ అనధికారికంగా ప్రకటించారు. లోకల్ నేతల నుంచి ఏకాభిప్రాయం రావడంతో డీసీసీగా భరత్ చంద్రా రెడ్డిని డిక్లేర్ చేశారుఇక ఖమ్మం జిల్లాలో ముగ్గురు ముఖ్యనేతల మధ్య ఆధిపత్యపోరు డీసీసీకి ఇబ్బందికరంగా మారింది. రేణుకాచౌదరి..భట్టి విక్రమార్క..పొంగులేటి సుధాకర్‌లు ఎవరికీ వారు తమ ఆధిపత్యం నిలుపుకునేందుకు తమ అనుచరులను డీసీసీని కట్టబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం డీసీసీగా ఉన్న ఐతం సత్యం భట్టికి అనుచరుడిగా పేరుంది. కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్‌రావు తనయుడు రాఘవ డీసీసీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి రేణుకాచౌదరి తన అనుచరుడు ఎడవెల్లి కృష్ణ డీసీసీ కోసం ముమ్మరంగా లాబీంగ్ చేస్తున్నారు. దీంతో ఇక్కడ ఎంపిక పీసీసీకి సవాల్‌గా మారింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16640
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author