సౌత్ లో మోడీ తంత్రం వర్క్ వుట్ అవుతుందా

సౌత్ లో మోడీ తంత్రం వర్క్ వుట్ అవుతుందా
January 31 12:58 2018
చెన్నై,
మోదీ మంత్రంతో కేంద్రంలో బీజేపీ అధికారం ఏర్పాటు చేసింది. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఆ పార్టీ మంచి ప‌ట్టు సాధించింది. కేవ‌లం మోదీ మీద అభిమానంతో ఆయా రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌జ‌లు బీజేపీ వైపు మొగ్గు చూపించారు. అయితే దేశ రాజ‌కీయాల్లో ద‌క్షిణాది రాష్ట్రాలు మాత్రం ఎప్పుడు విభిన్న‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తుంటాయి. ఓ సారి ప్రాంతీయ పార్టీకి మ‌రో సారి జాతీయ పార్టీకి ప‌ట్టం క‌డుతుంటాయి. అయితే ఇన్ని సంవ‌త్ప‌రాల రాజ‌కీయ చ‌రిత్ర‌లో బీజేపీ మాత్రం ఎప్పుడు త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయింది. కాని ఇప్పుడు మోదీ ఎలాగైన ద‌క్షిణాదిన ముఖ్యంగా తెలంగాణ‌, ఏపీ, త‌మిళ‌నాడులు స్ప‌ష్ట‌మైన మెజారిటీ సాధించాల‌నే ఉద్దేశ్యంతో పావులు క‌దుపుతున్నారు. స్థానిక రాజ‌కీయాల‌కు అనుగుణంగా త‌న స్ట్రాట‌జీని మార్చుకుంటూ వ్యూహాలు ర‌చిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీతో పొత్తు  పెట్టుకుంది. ప్ర‌స్తుతం టీడీపీ అధికారంలో ఉన్న‌ప్ప‌టికి రెండు పార్టీల మ‌ధ్య కొంత అగాదం ఏర్ప‌డింది. ఇదే త‌రుణంగా బీజేపీ వైసీపీ నేత జ‌గ‌న్‌తో కూడా ట‌చ్‌లో ఉంది. ప‌లుమార్లు జ‌గ‌న్ ఢిల్లి వెళ్లి మోదీతో పాటు కేంద్ర మంత్రుల‌ను క‌లిసి రావ‌డంతో పొత్తుపై అనేక చ‌ర్చ‌లు జ‌రిగాయి. తెలంగాణ‌లో టీఆర్ఎస్‌తో బ‌య‌టి నుంచి సంబంధాలు బాగానే ఉన్నాయి. అయితే అధికార పార్టీల‌తో క‌లిసి ప‌నిచేస్తున్న బీజేపీ ప్ర‌త్యామ్న‌య దారుల‌ను కూడా వెతుకుతుంది. ఇందులో భాగంగా సినీ న‌టుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. కేంద్రం సూచ‌న మేర‌కు ప‌వ‌న్ తెలంగాణ‌, ఏపీలో రాష్ట్రాలో తిరిగేందుకు ఆయా ప్ర‌భుత్వాలు అనుమ‌తులు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోయిన అది కాంగ్రెస్ లాభం చేకూర‌కుండా ఉండేందుకు బీజేపీ ఈ త‌ర‌హా వ్యుహం అమ‌లు చేస్తున్న‌ట్టు సీనియ‌ర్‌లు చెబుతున్నారు. త‌మిళ‌నాడులో కూడా బీజేపీ మ‌ద్ద‌తుతోనే ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ పార్టీ పెడుతున్నాడు. తెలంగాణ ఏపీ విష‌యం బ‌య‌ట‌పెడితే బీజేపీ స్టాట‌జీకి క‌మ‌ల్‌హాస‌న్‌, ప్ర‌కాశ్‌రాజ్ అడ్డుగా మార‌తారేమోన‌ని అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. వారు బీజేపీ వ్య‌తిరేకంగా పోరాటం చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో మోదీ అక్క‌డ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి మ‌రి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16661
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author