సిటీలో 51 మంది ప్లానర్స్ కు నోటీసులు

సిటీలో 51 మంది ప్లానర్స్ కు నోటీసులు
February 01 10:48 2018
హైద్రాబాద్,
 హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో నకిలీ కన్సల్టెన్సీ, ఆర్కిటెక్ట్‌ల ఏరివేతకు రంగం సిద్ధమైంది. డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం (డీపీఎంఎస్) ద్వారా అనుమతుల జారీని పారదర్శకం చేసినా నకిలీల బెడద వీడడం లేదు. ఇందులో భాగంగానే నిర్మాణ రంగ అనుమతుల దరఖాస్తుల సమయంలో జీవో నెం. 10 నిబంధనలకు తుంగలో తొక్కిన 51 మంది ప్లానర్స్, అర్కిటెక్ట్‌లకు నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో నకిలీ ఎల్‌ఆర్‌ఎస్ ప్రొసీడింగ్స్‌లను సీరియస్‌గా పరిగణించిన కమిషనర్ చిరంజీవులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను రంగంలోకి దించారు. మూడురోజులు పాటు విచారణ చేపట్టిన డీఎస్పీ రహమాన్ బృందం బాధ్యులైన రియల్ ఎస్టేట్ బ్రోకర్ రాజేశం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి (జేపీపీ) సైదులుపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  తార్నాకసంస్థ కేంద్ర కార్యాలయ క్యాంపస్ పరిధిలో షాపులను అడ్డాగా మలచుకుని అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్న కన్సల్టెన్సీలు, ఆర్కిటెక్ట్‌లను ఏరివేయాలని కమిషనర్ చిరంజీవులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ రహమాన్‌కు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. నకిలీ ఎల్‌ఆర్‌ఎస్ ప్రొసీడింగ్ వ్యవహారంలో ఆయా షాపులను సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రత్యేక స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టి ప్రభుత్వ అనుమతి లేకుండా ఉన్న ప్లానర్లు, కన్సల్టెన్సీలు, అర్కిటెక్ట్‌లపై చర్యలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ సిద్ధమైంది. ఆయా పనుల కోసం సంబంధిత షాపులకు వచ్చే వారిలో దరఖాస్తుదారు మినహా ఇతరులు ఉండరాదని కార్యాలయ ప్రాంగణంలో ఉన్న షాపు నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆయా పనులను కార్యాలయాలకు వచ్చే వారంతా మధ్యాహ్నం 3 నుంచి ఐదు గంటల వరకు అనుమతి ఉంటుందని, మధ్యవ్యక్తుల ప్రమేయం లేకుండాఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16670
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author