సీతారామా ప్రాజెక్టు ద్వారా సాగునీరు

సీతారామా ప్రాజెక్టు ద్వారా సాగునీరు
February 01 10:51 2018
ఖమ్మం,
సీతారామా ప్రాజెక్టు ద్వారా కృష్ణా పరివాహ ప్రాంతానికి సాగునీరు అందించబోతున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలోని కృష్ణా పరివాహక ప్రాంతం నీరులేక ఆయకట్టు ఎండిపోతుందని గోదావరి నీటిద్వారా ఆలోటును తీర్చాలనే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతమున్న సంక్షోభాన్ని ఎదుక్కోవాలంటే గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవడం తప్పదని అన్నారు. సీతారం ప్రాజెక్టు ద్వారా కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి ఆప్రాంతాన్ని సస్యశామలం చేయడం జరుగుతుందన్నారు. ఎల్లప్పుడూ నిండుగావుండే గోదావరి నీటిని కృష్ణా బేషన్‌కు తరలించడం, అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా నిర్మించిన లక్షలాది చెరువుల్లోకి నీటిని పంపించడంతో రాష్ట్రాన్ని సస్యశామలం చేయవచ్చని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి అన్నారు. 13 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న అంకమ్మ చెరువు మినీ ట్యాంక్‌బండ్ పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంకమ్మ చెరువు మిగులు జలాలను దబ్బతోగు, లోతువాగు, పెదవాగు ప్రాజెక్టుల్లోకి నీటిని మళ్లించి ఆయా ప్రాజెక్టుల కింద ఆయకట్టును సస్యశామలం చేసేందుకు కాలువ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని 22 హైలెవల్ వంతెనలను రూ 56 కోట్లతో నిర్మించడం జరుగుతుందని వివరించారు. బూర్గంపాడు, అశ్వారావుపేట రహదారిని వెంకటాపురం, ములకలపల్లి మీదుగా మళ్లించాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అశ్వారావుపేట మీదుగా రాజమండ్రి వెళ్లే నాలుగు లైన్ల జాతీయ రహదారి పనులకు త్వరలోనే స్వీకారం చుట్టనున్నట్లు మంత్రి వెళ్లడించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తోందని అందులో భాగంగానే రైతులకు 24 గంటల విద్యుత్ అందించడం జరుగుతుందన్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16673
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author