మైలవరం లో ఇళ్ల పట్టాల పంపిణీ 

మైలవరం లో ఇళ్ల పట్టాల పంపిణీ 
February 01 22:08 2018
మైలవరం,
పట్టాల పంపిణీ కార్యక్రమం ఎక్కడా మొదలు కాలేదని మొట్టమొదటి సారిగా మైలవరంలోనే అది జరుగుతుందని  అన్ని జిల్లాల్లో కూడా ఇదేవిధంగా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా తెలిపినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం నాడు మండలంలో మంత్రి ఉమా పర్యటించారు. మొదటగా మైలవరం ప్రభుత్వ ఆసుపత్రులో ముఖ్యమంత్రి ఐ కేంద్రాన్ని (టెలీ ఆప్తమాలజీ) ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. శానిటేషన్ నుంచి మందుల వరకు ఎటువంటి లోపాలు ఉండకూడదని ఆసుపత్రికి సిబ్బందికి తెలిపారు. అనంతరం పొందుగలలో 245 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. దళితవాడలో చంద్రన్న ముందడుగు దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి, పాదయాత్ర చేశారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో కి తీసుకు రావడానికి ముఖ్య మంత్రి చంద్రబాబు చేస్తున్న కృషితో నవ్యాంధ్ర దళితులు ఆర్థిక సామాజిక అభివృద్ధి సాధించేవైపు అడుగులేస్తుందన్నారు.  రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబం మరింత ఆర్థిక పురోగతిని సాధించి నెలకు 10వేలు ఆదాయాన్ని సమకూర్చుకునే లా చర్యలు తీసుకుంటూ వారి అభ్యున్నతికి తెలుగుదేశం ప్రభుత్వం మరింత భరోసాను కల్పిస్తుందని అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16737
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author