పారదర్శకంగా లేని బడ్జెట్ – ఎంపీ కవిత

పారదర్శకంగా లేని బడ్జెట్ – ఎంపీ కవిత
February 01 22:36 2018
హైదరాబాద్,
ఊహించినట్లుగా గ్రామీణ ప్రజల అభివృద్ధికి ఈ బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నట్లు అనిపించలేదు. విద్యా, ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టామని చెప్పారు. కానీ ఈ తరహాలో విద్యాభివృద్ధికి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించినట్లు కన్పించలేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలకు కాకుండా  కొన్నింటినే ఎంపిక చేసినట్లుగానే ఈ బడ్జెట్ ఉంది. పారదర్శకంగా ఉన్న బడ్జెట్ ల మాత్రం ఈ బడ్జెట్ కన్పించలేదని అన్నారు. ఇంకొంత స్పష్టత, పేద ప్రజల పక్షాన ఈ బడ్జెట్ ఉండి ఉంటే బాగుండేది. రైతులకు కనీస మద్దతు ధర అన్న ఒక్క విషయమే బడ్జెట్ అనుకూల అంశమని అన్నారు. ఈ మద్దతు ధర సైతం అన్ని పంటలకా, లేక కొన్నింటికే పరిమితమా అన్న విషయంలో స్పష్టత లేదు. చివరి బడ్జెట్ లో బిజేపి కనీస మద్దతు గురించి ఆలోచించింది. మొదటి బడ్జెట్ లో ఈ ప్రతిపాదన ఉంటే మూడేళ్లుగా రైతులు లబ్ధిపొందేవారన్నారు. ఏ విధంగా రైతులకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పకపోవడం బాధాకరం. హెల్త్ సెక్టర్ లో అత్యంత పేద ప్రజలకు 5 లక్షలు ఇస్తామనడం హర్షించదగ్గ విషయం. జన్ ధన్ అకౌంటు లలో 60 కోట్లు ఉన్నాయని చెబుతూ, 10 కోట్ల మందికే ఈ స్కీం వర్తిస్తుందని చెబుతున్నారని ఆమె అన్నారు. 10 కోట్ల కుటుంబాల, 10 కోట్ల మంది కా అన్న అంశంలో క్లారిటీ రావాలి. ఈజ్ ఆప్ బిజినెస్ లో దేశం అభివృద్ధి చెందిందని చెబుతున్నారు కానీ, ఇందులో రాష్ట్రాల పని తీరును చెప్పకపోవడం బాధాకరమని అన్నారు.
మహిళ శిశు సంక్షేమానికి సంబంధించి కుడా  బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం బాధాకరమి కవిత వ్యాఖ్యానించారు. పెద్ద పెద్ద కంపెనీలను వదిలి, మధ్య, చిన్న తరహా పరిశ్రమలపై టాక్స్ లు వేయడం సరైంది కాదు. టాక్స్ వసూళ్లపై గతంలోనూ మేము స్పందించాం. ఢిల్లీలో కూర్చొని గ్రామాల్లో పనిచేస్తోన్న ఉపాధి హామి కూలీలకు అకౌంట్లో డబ్బులు వేస్తామనడం సరైంది కాదని అన్నారు. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలు సిరియస్ గా తీసుకోవాలని ఆమె సూచించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16752
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author