బెజవాడ బందరు రోడ్డు… బిగ్గెస్ట్ స్మార్ట్ స్ట్రీట్….

బెజవాడ బందరు రోడ్డు… బిగ్గెస్ట్ స్మార్ట్ స్ట్రీట్….
February 02 12:22 2018
విజయవాడ,
రాజధాని అమరావతి ప్రాంతంలో, కీలకమైన విజయవాడను స్మార్ట్ గా తీర్చిదిద్దటానికి అనేక నూతన అధునాతన ప్రాజెక్టులను అమలు చేయటానికి, నగరపాలక సంస్థ ప్రయత్నాలు చేస్తుంది… ఇందులో భాగంగా దేశంలోనే అతి పెద్ద స్మార్ట్ స్ట్రీట్ గా, విజయవాడ బందర్ రోడ్డును రెడీ చేసారు… గోల్డెన్ మైల్ ప్రాజెక్టు పేరుతో, బెంగళూరుకు చెందిన సిస్కో సంస్థ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు… మొత్తం ఈప్రాజెక్టు వ్యయం రూ. 7.91 కోట్లుగా నిర్ధారించారు. దీనిలో సిస్కో రూ. 3.81 కోట్ల భరిస్తోంది. దీనికి సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది. మిగిలిన రూ.4.10 కోట్ల విజయవాడ నగరపాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం భరించింది… పీవీపీ మాల్లో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.ఈ ప్రాజెక్ట్ లో భాగంగా, కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి, బందర్ రోడ్డు దాకా, రోడ్డు మొత్తం స్మార్ట్ గా తయారు చేసారు… గోల్డెన్ మైల్ ప్రాజెక్టులో భాగంగా బందరు రోడ్డులో పూర్తిస్థాయిలో వైఫై అందుబాటులోకి తెస్తారు. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవచ్చు. స్మారు ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రత భాగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ ట్రాఫిక్ జాం అయినా వెంటనే కంట్రోల్ రూంకు సమాచారం అందుతుంది. దీంతో ట్రాఫిక్ మళ్లింపు చేపడతారు. ప్రస్తుతం యూటర్స్ల తీరు మార్చారు. గోల్డెన్ మైల్ ప్రాజెక్టు కింద సిసి కెమెరాలు, సెన్సార్‌లు ఈ రోడ్డు అంతా ఏర్పాటు చేయటం ద్వారా నగర ప్రజలు నగరంలో ట్రాఫిక్, వాతావరణ సమాచారం, హ్యుమిడిటి, ఉష్ణోగ్రత, లొకేషన్ వంటి సమాచారం ప్రజలు తెలుసుకోగలరు. నగరంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి వీడియో సర్వైవలెన్స్ ఆపరేషన్ ద్వారా సమాచారం తెలుసుకోవటమే కాకుండా ఆన్‌లైన్ పేమెంట్స్, ఆన్‌లైన్ ట్యాక్సెస్, థియేటర్స్ సమాచారం తెలుసకోవచ్చు. అత్యవసర పరిస్థితులలో అధికార యంత్రాంగాన్ని సంప్రదించే సదుపాయం కూడా ఇందులో ఉంటుండి… అలాగే 8 బస్ స్టాండ్ లలో, led స్క్రీన్స్ ఏర్పాటు సెహ్సారు…అలాగే సెన్సార్లతో పని చేసే ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేసారు..వాహనం వెళుతుంటే.. వెలుగును తగ్గించుకుంటాయి… రోడ్డు నిర్మానుష్యంగా ఉంటే ఆరిపోతాయి… చీకటిలో మనుషులు వస్తుంటే వాటంతటవే వెలుగుతాయి… ఎంజీ రోడ్డులో కియోస్క్లు ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా బస్సు, రైల్వే, సినిమా టిక్కెటు నమోదు చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇవి ఇంకా ఏర్పాటు చేయలేదు.. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరానికి సంబంధించిన వివరాలతో సిటీ పోర్టల్ (ఇదివరకు ఉన్న వెబ్సైటు, ఇన్ఫర్మేషన్ అంతా కొత్తగా అప్డేట్ చేసారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=16781
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author